Parvez Rasool : ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చి పదేళ్లు కూడా కాలేదు.. రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన టీమిండియా ప్లేయర్

టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ మధ్యలోనే, భారత్‌కు చెందిన ఒక ఆటగాడు ఆకస్మికంగా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ ఆటగాడు జూన్ 15, 2014న భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి, జమ్మూ కాశ్మీర్ నుండి భారత్‌కు ఆడిన మొదటి క్రికెటర్‌గా నిలిచాడు.

Parvez Rasool : ఇంటర్నేషనల్ క్రికెట్‌లో ఎంట్రీ ఇచ్చి పదేళ్లు కూడా కాలేదు.. రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చిన టీమిండియా ప్లేయర్
Parvez Rasool

Updated on: Oct 20, 2025 | 3:13 PM

Parvez Rasool : టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ మధ్యలోనే, భారత్‌కు చెందిన ఒక ఆటగాడు ఆకస్మికంగా రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఈ ఆటగాడు జూన్ 15, 2014న భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసి, జమ్మూ కాశ్మీర్ నుండి భారత్‌కు ఆడిన మొదటి క్రికెటర్‌గా నిలిచాడు. అయితే ఇప్పుడు ఈ ఆటగాడు క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు.

జమ్మూ కాశ్మీర్ నుండి భారత్ తరఫున వన్డే మ్యాచ్ ఆడిన మొదటి క్రికెటర్ పర్వేజ్ రసూల్ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల ఈ ఆల్ రౌండర్ అక్టోబర్ 18న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకి తన నిర్ణయం గురించి తెలియజేశాడు. పర్వేజ్ రసూల్ జూన్ 15, 2014న బంగ్లాదేశ్‌తో మీర్‌పూర్‌లో తన మొదటి వన్డే ఆడాడు. ఆ మ్యాచ్‌లో అతను 10 ఓవర్లలో 60 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. జనవరి 26, 2017న కాన్పూర్‌లో ఇంగ్లండ్‌పై ఆడిన తన ఏకైక టీ20 మ్యాచ్‌లో అతను 5 పరుగులు చేసి, 32 పరుగులు ఇచ్చి ఇయాన్ మోర్గాన్ వికెట్ తీశాడు.

రసూల్ దేశవాళీ కెరీర్ చాలా అద్భుతంగా ఉంది. అతను 95 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 5648 పరుగులు చేశాడు. 352 వికెట్లు తీశాడు. దీనితో పాటు అతను 164 లిస్ట్ ఎ, 71 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. అతను రెండు సార్లు (2013/14, 2017/18) రంజీ ట్రోఫీలో బెస్ట్ ఆల్ రౌండర్‌గా లాలా అమర్‌నాథ్ ట్రోఫీ అవార్డును కూడా అందుకున్నాడు. ఐపీఎల్‌లో అతను పూణే వారియర్స్ ఇండియా, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున మొత్తం 11 మ్యాచ్‌లు ఆడాడు.

రిటైర్‌మెంట్ ప్రకటించిన తర్వాత రసూల్ స్పోర్ట్‌స్టార్‌తో మాట్లాడుతూ.. “మేము ఆడటం ప్రారంభించినప్పుడు, చాలా మంది జమ్మూ కాశ్మీర్ క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకోలేదు. మేము కొన్ని పెద్ద జట్లను ఓడించాము. రంజీ ట్రోఫీ, ఇతర బీసీసీఐ అనుబంధ టోర్నమెంట్‌లలో కూడా బాగా రాణించాము. నేను చాలా కాలం పాటు జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాను. జట్టు విజయంలో కొంత సహకారం అందించినందుకు నాకు చాలా సంతృప్తి లభించింది” అని అన్నాడు.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..