Team India: ఏడాదిగా టీమిండియా దూరం.. కట్‌చేస్తే.. సెంచరీతో సెలెక్టర్లకు గుండె దడ పెంచిన సీనియర్ ప్లేయర్

|

Sep 02, 2024 | 10:55 AM

Ajinkya Rahane: అజింక్యా రహానెను టీమిండియా నుంచి తప్పించి ఏడాది కావస్తోంది. భారత్ తరపున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రహానే 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలతో మొత్తం 5077 పరుగులు చేశాడు. అయితే, త్వరలో జరగనున్న దులీప్ ట్రోఫీ టోర్నీకి అతను ఎంపిక కాలేదు.

Team India: ఏడాదిగా టీమిండియా దూరం.. కట్‌చేస్తే.. సెంచరీతో సెలెక్టర్లకు గుండె దడ పెంచిన సీనియర్ ప్లేయర్
Ajinkya Rahane Century
Follow us on

Ajinkya Rahane: ఇంగ్లండ్‌లో జరుగుతున్న కౌంటీ ఛాంపియన్‌షిప్ డివిజన్ టూ మ్యాచ్‌లో అజింక్య రహానే అద్భుతమైన సెంచరీ సాధించాడు. రహానే సెంచరీతో లీసెస్టర్ షైర్ జట్టు ఓడిపోయే మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం విశేషం. కార్డిఫ్‌లోని సోషియా గార్డెన్స్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో గ్లామోర్గాన్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తదనుగుణంగా, మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన లీసెస్టర్‌షైర్ అజింక్య రహానే 42 పరుగులు చేయగా, హ్యాండ్‌స్కోబ్ 46 పరుగులు చేశాడు. దీంతో లీసెస్టర్‌షైర్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌటైంది.

ఆ తర్వాత, గ్లామోర్గాన్ జట్టులో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కొలిన్ ఇంగ్రామ్ 375 బంతుల్లో 28 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 257 పరుగులు చేశాడు. ఈ డబుల్ సెంచరీ సాయంతో గ్లామర్గాన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 550 పరుగులు చేసింది.

299 పరుగుల వెనుకంజలో..

299 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన లీసెస్టర్ షైర్ జట్టు 74 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బరిలోకి దిగిన అజింక్యా రహానే జట్టుకు ఆసరాగా నిలిచాడు.

బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించిన రహానే 192 బంతుల్లో 1 సిక్స్, 13 ఫోర్లతో 102 పరుగులు చేశాడు. అలాగే, పీటర్ హ్యాండ్‌స్కోబ్ (139) కూడా మంచి సహకారం అందించి లీసెస్టర్‌షైర్ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. చివరకు లీసెస్టర్‌షైర్ జట్టు 6 వికెట్లు కోల్పోయి 369 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది.

గ్లామోర్గాన్ ప్లేయింగ్ 11: ఆసా ట్రైబ్, సామ్ నార్త్ఈస్ట్ (కెప్టెన్), కోలిన్ ఇంగ్రామ్, కీరన్ కార్ల్సన్, బిల్లీ రూట్, క్రిస్ కుక్ (వికెట్ కీపర్), డేనియల్ డౌత్‌వైట్, టిమ్ వాన్ డెర్ గుగ్టెన్, మాసన్ క్రేన్, ఫ్రేజర్ షీట్, నెడ్ లియోనార్డ్.

లీసెస్టర్‌షైర్ ప్లేయింగ్ 11: రిషి పటేల్, ఇయాన్ హాలండ్, లూయిస్ హిల్ (కెప్టెన్), అజింక్యా రహానే, పీటర్ హ్యాండ్‌స్కోబ్ (వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, లూయిస్ కింబర్, లియామ్ ట్రెవాస్కిస్, టామ్ స్క్రీవెన్, సామ్ వుడ్, క్రిస్ రైట్.

పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న రహానే..

టీమిండియా నుంచి అజింక్యా రహానె తప్పుకుని ఏడాది గడిచింది. భారత్ తరపున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రహానే 12 సెంచరీలు, 26 అర్ధసెంచరీలతో మొత్తం 5077 పరుగులు చేశాడు. అయితే, త్వరలో జరగనున్న దులీప్ ట్రోఫీ టోర్నీకి అతను ఎంపిక కాలేదు. అందుకే ఇంగ్లండ్‌లో కౌంటీ ఛాంపియన్‌షిప్ ఆడుతున్న అతను ఇప్పుడు భారీ సెంచరీ సాధించి టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..