Video: బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ ప్రేమాయణం.. ఎవరో తెలుసా?

Mohammed Siraj Dating Rumors: టీమిండియా స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ వ్యక్తిగత జీవితం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ నటి, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ మహీరా శర్మతో ఆయన ప్రేమాయణం సాగిస్తున్నట్లు గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్ వద్ద కనిపించడంతో ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లయింది.

Video: బిగ్‌బాస్ బ్యూటీతో సిరాజ్ ప్రేమాయణం.. ఎవరో తెలుసా?
Mohammed Siraj And Mahira Sharma Spotted

Updated on: Mar 29, 2026 | 4:59 PM

Mohammed Siraj Dating Rumors: భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి ఆట తీరుతో కాకుండా తన వ్యక్తిగత జీవితం వల్ల ఆయన చర్చనీయాంశమవ్వడం గమనార్హం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో సిరాజ్, నటి మహీరా శర్మ ముంబైలోని ఒకే రెస్టారెంట్ వద్ద కనిపించారు. అయితే, వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో పక్కపక్కన కనిపించలేదు. సిరాజ్ బయట అభిమానులతో మాట్లాడుతుండగా, మహీరా అదే సమయానికి రెస్టారెంట్ నుంచి బయటకు వచ్చి తన కారు వైపు వెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తోంది. ఈ దృశ్యాలు చూసిన నెటిజన్లు వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.

గతంలోనూ ఇదే తరహా ప్రచారం..

సిరాజ్, మహీరా శర్మల మధ్య సంబంధం ఉందనే వార్తలు రావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది కూడా వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో ఒకరి పోస్టులను మరొకరు లైక్ చేయడం, ఫాలో అవ్వడం వంటివి అభిమానుల దృష్టిని ఆకర్షించాయి. అప్పట్లో ఈ వార్తలపై మహీరా శర్మ స్పందిస్తూ.. తాను ఎవరితోనూ డేటింగ్‌లో లేనని, పుకార్లను నమ్మవద్దని స్పష్టం చేసింది.

ఖండించిన సిరాజ్.. ఆ తర్వాత ఏమైంది..?

డేటింగ్ వార్తలు శృతిమించుతున్న తరుణంలో మహమ్మద్ సిరాజ్ కూడా గతంలో ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించాడు. తనపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమైనవని, అవి వాస్తవం కాదని ఆయన ఒక స్టోరీ పెట్టారు. అయితే, ఆశ్చర్యకరంగా ఆ పోస్టును పెట్టిన కొద్దిసేపటికే ఆయన తొలగించడం గమనార్హం. దీంతో అభిమానుల్లో అనుమానాలు మరింత పెరిగాయి.

సిరాజ్ ప్రస్తుత పరిస్థితి..

ప్రస్తుతం సిరాజ్ ఐపీఎల్ 2026 సీజన్ కోసం గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు. ఒకవైపు క్రికెట్ కెరీర్‌లో బిజీగా ఉన్నప్పటికీ, ఇలాంటి పుకార్లు ఆయన వెంటాడటం గమనార్హం. వీరిద్దరి సంబంధంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. కేవలం యాదృచ్ఛికంగా ఒకే చోట కనిపించారా లేదా నిజంగానే వీరి మధ్య ఏదైనా ఉందా అనేది కాలమే నిర్ణయించాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us