Team India : నైట్ క్యాంపింగ్‌లో సూర్య సేన హల్చల్.. టీ20 సిరీస్ ముందు క్రేజీ సీన్

Team India : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి టీ20 సిరీస్‌పై పడింది. జనవరి 21 నుంచి భారత్-కివీస్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. వన్డే సిరీస్‌లో లేని టీ20 స్పెషలిస్ట్ ఆటగాళ్లు ఇప్పటికే నాగ్‌పూర్ చేరుకున్నారు.

Team India : నైట్ క్యాంపింగ్‌లో సూర్య సేన హల్చల్.. టీ20 సిరీస్ ముందు క్రేజీ సీన్
Team India

Updated on: Jan 19, 2026 | 7:10 PM

Team India : న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి టీ20 సిరీస్‌పై పడింది. జనవరి 21 నుంచి భారత్-కివీస్ మధ్య 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్ వేదికగా జరగనుంది. వన్డే సిరీస్‌లో లేని టీ20 స్పెషలిస్ట్ ఆటగాళ్లు ఇప్పటికే నాగ్‌పూర్ చేరుకున్నారు. నాగ్‌పూర్ నగరాన్ని టైగర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఏకంగా అరడజను టైగర్ రిజర్వ్‌లు ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్ల నుంచి కాస్త విరామం దొరకడంతో టీమిండియా స్టార్లు అడవి బాట పట్టారు.

టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో ఇషాన్ కిషన్, సంజు శాంసన్, రవి బిష్ణోయ్, రింకూ సింగ్ వంటి ఆటగాళ్లు టైగర్ రిజర్వ్‌ను సందర్శించారు. వీరంతా ఓపెన్ జిప్సీ కార్లలో అడవిలో సఫారీ చేస్తూ ప్రకృతిని ఆస్వాదించారు. కేవలం పగలు తిరగడమే కాకుండా, రాత్రి సమయంలోనూ అడవిలో క్యాంపింగ్ వేసి సందడి చేశారు. చీకటి వెలుగుల్లో పులులను చూస్తూ, అడవి మధ్యలో నడుస్తూ దిగిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మైదానంలో ప్రత్యర్థులకు చుక్కలు చూపించే ఈ టైగర్స్, అసలు సిసలు పులులను చూసి తెగ సంబరపడిపోయారు.

భారత్, న్యూజిలాండ్ మధ్య మొత్తం ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి పోరు నాగ్‌పూర్‌లో ముగిశాక, రెండో మ్యాచ్ జనవరి 23న రాయ్‌పూర్‌లో జరుగుతుంది. జనవరి 25న మూడో టీ20 గువహటిలో, జనవరి 28న నాలుగో టీ20 మన వైజాగ్ (విశాఖపట్నం)లో జరగనుంది. ఆఖరి, ఐదో టీ20 జనవరి 31న తిరువనంతపురంలో నిర్వహిస్తారు. వన్డే సిరీస్‌ను కోల్పోయిన భారత్, ఎలాగైనా టీ20 సిరీస్‌ను గెలిచి దెబ్బకు దెబ్బ తీయాలని పట్టుదలతో ఉంది.

రోహిత్, విరాట్ వంటి సీనియర్లు లేకపోవడంతో టీ20 జట్టు మొత్తం యువ ఆటగాళ్లతో కళకళలాడుతోంది. రింకూ సింగ్ ఫినిషింగ్, సంజు శాంసన్ మెరుపులు, సూర్యకుమార్ 360 డిగ్రీల బ్యాటింగ్ చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అడవిలో పులులను చూసి వచ్చిన జోష్‌తో, మైదానంలో కివీస్ జట్టును వేటాడేందుకు టీమిండియా సిద్ధమైంది. నాగ్‌పూర్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందనే వార్తల నేపథ్యంలో రవి బిష్ణోయ్ వంటి బౌలర్లు ఎలా రాణిస్తారో చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..