గతేడాది మెల్‌బోర్న్ టెస్ట్‌లో సెంచరీ సాధించడంతో పాటు కెప్టెన్‌గా జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు అజింక్యా రహానే. అయితే ఆ తర్వాత లయ కోల్పోయాడు. వరుసగా వైఫల్యాలు ఎదుర్కొంటున్నాడు. కాగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులోనూ బ్యాటింగ్ పరంగా దారుణంగా విఫలమయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 35 పరుగులు చేసిన రహానే.. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు. దీంతో ఈ క్రికెటర్ ఆటతీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ అతను కెప్టెన్ కాకపోయి ఉంటే జట్టు నుంచి తొలగించేవారంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా వచ్చాయి. ముంబయిలో జరిగే రెండో టెస్టుకు విరాట్ కోహ్లీ జట్టులో చేరనుండడంతో రహానేపై వేటు తప్పదని చాలామంది అనుకుంటున్నారు. తాజాగా ఈ విషయంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ స్పందించాడు. తొలి టెస్ట్ మ్యాచ్ ముగిసిన అనంతరం మాట్లాడిన ఆయన రహానే ఫామ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘అజింక్యా ఫామ్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అతనొక అద్భుతమైన ఆటగాడు. గతంలో ఎన్నోసార్లు టీమిండియా బ్యాటింగ్‌కు వెన్నెముకలా నిలిచాడు. ప్రస్తుతం అతను గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అంతమాత్రాన దిగులు చెందాల్సిన అవసరం లేదు. అతనికి బ్యాటింగ్‌లో మంచి టెక్నిక్‌తో పాటు అనుభవం ఉంది. ఇప్పుడు జట్టుకు ఇవి చాలా అవసరం అవసరం. రహానే ఫామ్‌లోకి తిరిగిరావడానికి ఒక్క మ్యాచ్ చాలు. ముంబయి వేదికగా జరిగే రెండో టెస్ట్ తుది జట్టులో రహానే ఉంటాడా లేదా అనేది ఇప్పుడే చెప్పలేం. ముంబయి పరిస్థితులు, ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రామాణికంగానే తుది జట్టును ఎంపిక చేస్తాం. అదేవిధంగా రెండో టెస్టుకు కెప్టెన్‌గా కోహ్లీ తిరిగి రానున్నాడు. అతనితో ఈ విషయంపై చర్చించి రహానేపై ఒక నిర్ణయానికి వస్తాం. అప్పటివరకైతే అతను తుది జట్టులో ఉంటాడు’ అని ద్రవిడ్ తెలిపారు.
Also Read:
IND vs NZ: డ్రాగా ముగిసిన తొలి టెస్ట్.. భారత్ పోరాటం వృథా..
IND vs SA: పొంచి ఉన్న ఓమిక్రాన్ ముప్పు.. భారత్‌తో సిరీస్‌పై క్లారిటీ ఇచ్చిన ద.ఆఫ్రికా టీం సీఈవో