IND vs WI: టీమిండియా కొత్త జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట్లో పేలుతోన్న సెటైర్లు..

|

Jul 11, 2023 | 5:55 PM

Team India New Test Jersey: టీమిండియా సారథితోపాటు ఇతర ఆటగాళ్ళు కూడా తమ కొత్త జెర్సీ ఫొటోను కూడా పంచుకున్నారు. ఇప్పుడు దీనిపై అభిమానుల స్పందన కూడా కనిపిస్తోంది. ఇందులో చాలా మంది అభిమానులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

IND vs WI: టీమిండియా కొత్త జెర్సీపై ఫ్యాన్స్ ఫైర్.. నెట్టింట్లో పేలుతోన్న సెటైర్లు..
Team India
Follow us on

Team India New Test Jersey: భారత జట్టు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2023-25 ​​సైకిల్‌ను వెస్టిండీస్‌తో 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌తో ప్రారంభించనుంది. జులై 12 నుంచి డొమినికాలోని విండ్సర్ పార్క్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ టెస్టు సిరీస్‌లో భారత జట్టు కొత్త జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టనుంది. కొత్త జెర్సీని నేడు విడుదలే చేశారు. ఈ క్రమంలో కొత్త జెర్సీతో ఆటగాళ్ల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కెప్టెన్ రోహిత్ శర్మ కొత్త టెస్ట్ జెర్సీతో తన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. టీమిండియా సారథితోపాటు ఇతర ఆటగాళ్ళు కూడా తమ కొత్త జెర్సీ ఫొటోను కూడా పంచుకున్నారు. ఇప్పుడు దీనిపై అభిమానుల స్పందన కూడా కనిపిస్తోంది. ఇందులో చాలా మంది అభిమానులు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బీసీసీఐ) పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

టీమిండియా కొత్త కిట్ స్పాన్సర్, కొత్త జెర్సీ స్పాన్సర్ లోగో కారణంగా కొత్త జెర్సీ చాలా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. చాలా మంది అభిమానులు దీన్ని అస్సలు ఇష్టపడడంలేదు. ఇంతకుముందు, టీమిండియా WTC ఫైనల్స్‌లో ఆడటానికి వచ్చినప్పుడు, దాని జెర్సీ మధ్యలో ఇండియా అని రాసి ఉంది. దీనిని అభిమానులు చాలా ఇష్టపడ్డారు.

టెస్టు సిరీస్‌లో యశస్వి జైస్వాల్ అరంగేట్రం..


వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టెస్టులో యువ ఎడమచేతి వాటం ఆటగాడు యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమని భావిస్తున్నారు. ఈ టెస్టు సిరీస్‌లో చెతేశ్వర్ పుజారాకు టీమిండియాలో చోటు దక్కలేదు. అదే సమయంలో యశస్వికి నంబర్-3 స్థానంలో అవకాశం వస్తుందని భావిస్తున్నారు. వెస్టిండీస్ పర్యటనలో 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో యశస్వి హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడి అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..