Team India : ఓవల్ టెస్ట్ తర్వాత షాకింగ్ ట్విస్ట్.. టీమిండియా, ఇంగ్లాండ్ కలిసి ప్లాన్ చేసింది ఇదా?

ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ ఓవల్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ సిరీస్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లారు. సాధారణంగా మ్యాచ్ గెలిచిన తర్వాత టీమ్ డ్రెస్సింగ్ రూమ్‌లోనే సెలబ్రేషన్స్ చేసుకుంటారు.

Team India : ఓవల్ టెస్ట్ తర్వాత షాకింగ్ ట్విస్ట్.. టీమిండియా, ఇంగ్లాండ్ కలిసి ప్లాన్ చేసింది ఇదా?
Oval Test

Updated on: Aug 10, 2025 | 3:40 PM

Team India : ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా చివరి మ్యాచ్ ఓవల్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ ఆరు పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. టీమిండియా ఆటగాళ్లు అద్భుతమైన ప్రదర్శనతో ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, ఐదో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత ఆటగాళ్లు ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లారు. ఈ విషయాన్ని టీమిండియా బ్యాట్స్‌మెన్ కరుణ్ నాయర్ స్వయంగా వెల్లడించారు. ఈ సిరీస్ చాలా బాగుందని రెండు జట్లు భావించాయని కూడా ఆయన అన్నారు.

కరుణ్ నాయర్ మాట్లాడుతూ.. మ్యాచ్ ముగిసిన తర్వాత మేము డ్రెస్సింగ్ రూమ్‌లో పెద్దగా సెలబ్రేట్ చేసుకోలేదు. టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్ డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి, ఇరు జట్ల ఆటగాళ్లు చాలాసేపు మాట్లాడుకున్నారు. ఈ సిరీస్ చాలా బాగుందని అందరూ అనుకున్నారని చెప్పారు. ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఈ సిరీస్ ఇటీవల జరిగిన వాటిలో అత్యుత్తమమైనదని అన్నారు.

సిరీస్ వివరాల్లోకి వెళితే.. మొదటి టెస్ట్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ గెలుచుకుంది. రెండో టెస్ట్‌ను భారత్ గెలిచింది. మూడో టెస్ట్‌ను ఇంగ్లాండ్ గెలిచింది. నాలుగో టెస్ట్ డ్రా అయింది. ఐదో టెస్ట్‌లో భారత్ విజయం సాధించింది. ఈ ఐదో టెస్ట్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేసి, ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. ఈ సిరీస్ మొత్తం ఉత్కంఠభరితంగా సాగింది.

కరుణ్ నాయర్‌కు మొదటి మూడు టెస్ట్‌లలో అవకాశం లభించింది. కానీ అతను పెద్దగా రాణించలేకపోయాడు. అందుకే నాలుగో టెస్ట్‌లో ప్లేయింగ్ ఎలెవన్ నుంచి అతన్ని తప్పించారు. అయితే, నాలుగో టెస్ట్‌లో రిషభ్ పంత్ గాయపడటంతో, నాయర్‌కు ఐదో టెస్ట్‌లో మళ్లీ అవకాశం లభించింది. ఈ మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో 57 పరుగులు చేసి, భారత్ 224 పరుగులు చేయడానికి సహాయపడ్డారు. ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 247 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 396 పరుగులు చేసింది.

ఇంగ్లాండ్‌కు గెలవడానికి 374 పరుగులు అవసరం కాగా, వారు 367 పరుగులు మాత్రమే చేయగలిగారు. చివరి రోజు ఇంగ్లాండ్‌కు 35 పరుగులు, 4 వికెట్లు అవసరం అయ్యాయి. కానీ, మహ్మద్ సిరాజ్ అద్భుతమైన బౌలింగ్‌తో 9 వికెట్లు తీసి టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు టీమ్ ఇండియా అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది.

 

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..