Salman Butt Comments on Team India Participation in CWC 2025: ఈసారి ఫిబ్రవరిలో నిర్వహించే ఛాంపియన్ ట్రోఫీ 2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయి. అయితే అందులో పాల్గొనేందుకు టీమ్ ఇండియా పాకిస్థాన్ వెళ్తుందా లేదా అనే విషయం గురించి ఇప్పుడే చెప్పడం చాలా కష్టం. ప్రభుత్వ అనుమతి లేకుండా టీమిండియా అక్కడికి వెళ్లదని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. కాగా, ఈ విషయంలో పీసీబీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ సల్మాన్ బట్ అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వచ్చేలా భారత్‌ను ఒప్పించడం ICC పని. అది పాకిస్తాన్ పని కాదంటూ తేల్చిపడేశాడు.
తన యూట్యూబ్ ఛానెల్‌లో పాకిస్తాన్ మాజీ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ మాట్లాడుతూ, టీమిండియా పాకిస్తాన్‌కు వస్తే, వారికి ఘనంగా స్వాగతం చెబుతాం. కానీ వారు రాకపోతే ఐసీసీ డీల్ చేయాల్సి ఉంటుంది. రెగ్యులేటర్‌గా వారు ఇతర దేశాలతో మాత్రమే వ్యవహరిస్తారా లేదా అనేది అప్పుడే మనకు తెలుస్తుంది. రెగ్యులేటర్లుగా వారికి ఎంత అధికారం ఉంది, ఎంత తటస్థంగా ఉండగలరో కూడా తెలుస్తుంది. దాని గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం అంటూ చెప్పుకొచ్చాడు.
Salman Butt has given the ultimatum to BCCI over Champions Trophy 2025.
“If India comes,then they are welcome,if they don’t,ICC has to deal with it.We will find out if they can just deal with all the other countries or can do the same with India as well. It will show how much… pic.twitter.com/SaBM4CUen9
— Sujeet Suman (@sujeetsuman1991) July 2, 2024
2008 నుంచి భారత్ పాకిస్థాన్‌లో పర్యటించకపోవడం గమనార్హం. అదే సమయంలో గత ఏడాది ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు పాకిస్థాన్ జట్టు భారత్‌కు వచ్చింది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత సీనియర్ ఆటగాళ్లు పాల్గొంటారని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. అయితే షా చేసిన ఈ ప్రకటనతో పాకిస్థాన్ సంతోషించకూడదని బట్ నిషేధించారు.
“మేం ప్రతిదానిని సంచలనాత్మకం చేయడానికి ప్రయత్నిస్తాం,” అని బట్ తెలిపాడు. భారత్ పాకిస్థాన్‌కు రావడం, ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడడంపై జైషా సానుకూల సంకేతాలు ఇచ్చారని కొన్ని నివేదికలు తెలిపాయి. అయితే, అతను ఏదైనా ధృవీకరించినట్లు నేను అనుకోను. అతను ఒక సూచన ఇచ్చినప్పటికీ, నేను సంతోషించలేదు. ఎందుకంటే అన్ని జట్లు పాకిస్తాన్‌కు వచ్చేలా చూసుకోవడం ICC బాధ్యతని తెలిపాడు. కాగా, ఐసీసీ చివరి ఎడిషన్ 2017లో ఆడగా, ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను ఓడించి పాకిస్థాన్ టైటిల్ గెలుచుకోవడం గమనార్హం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..