Video: టీమిండియా వద్దంది.. కట్‌చేస్తే.. సెమీస్‌లో సెంచరీ.. ఫైనల్లో తుఫాన్ ఫిఫ్టీతో భీభత్సం.. ఆల్ రౌండర్ ఆట చూస్తే ఫిదానే..

Shardul Thakur fifty in Ranji Trophy Final: విదర్భతో జరుగుతోన్న రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ముంబై తరపున ఆడుతోన్న శార్దూల్ ఠాకూర్.. ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్‌తో బలమైన ముద్ర వేశాడు. తొలుత తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన శార్దుల్ కేవలం 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. అలాగే, బౌలింగ్‌లోనూ 1 వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

Video: టీమిండియా వద్దంది.. కట్‌చేస్తే.. సెమీస్‌లో సెంచరీ.. ఫైనల్లో తుఫాన్ ఫిఫ్టీతో భీభత్సం.. ఆల్ రౌండర్ ఆట చూస్తే ఫిదానే..
Ranji Trophy 2024, Shardul Thakur Fifty

Updated on: Mar 10, 2024 | 5:52 PM

Shardul Thakur fifty in Ranji Trophy Final: వాంఖడే స్టేడియంలో ముంబై, విదర్భ జట్ల మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో విదర్భ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముంబైకి శుభారంభం దక్కలేదు. లంచ్ సమయానికే ఆ జట్టు 109 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. మధ్యాహ్న భోజనం తర్వాత కూడా కథ అలాగే ఉండడంతో ముంబై స్కోరు బోర్డుపై 224 పరుగులు జోడించి మరో ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే ముంబై తరపున ఆడుతోన్న టీమిండియా ప్లేయర్ శార్దూల్ ఠాకూర్ మరోసారి సత్తా చాటాడు.

కాగా, 8వ స్థానంలో బరిలోకి దిగిన శార్దూల్ ఠాకూర్.. తుఫాన్ బ్యాటింగ్ చేసి విదర్భ స్పిన్ బౌలర్లపై స్వేచ్ఛగా షాట్లు ఆడాడు. కేవలం 37 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఈ క్రమంలో అతను 6 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో శార్దూల్‌కి ఇది 12వ అర్ధశతకం. శార్దూల్ ఈ బలమైన ఇన్నింగ్స్ కారణంగానే ముంబై జట్టు 200 పరుగుల మార్కును దాటగలిగింది. 7వ వికెట్‌కు శామ్స్ ములానీతో కలిసి శార్దూల్ 43 పరుగులు, 8వ వికెట్‌కు తనుష్ కొటియన్‌తో కలిసి 22 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. అనంతరం 75 పరుగులు చేసి చివరి వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో 8 ఫోర్లు, 3 సిక్సులు బాదాడు.

ఇవి కూడా చదవండి

శార్దూల్ ఠాకూర్ ఊచకోత వీడియో..

అంతకుముందు రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో తమిళనాడుపై శార్దూల్ సెంచరీ సాధించాడు. అప్పుడు శార్దూల్ 109 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. మ్యాచ్‌లో మొత్తం 4 వికెట్లు కూడా తీశాడు. ఈ ఆల్ రౌండ్ ప్రదర్శన కారణంగా శార్దూల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. శార్దూల్ 109 పరుగుల ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 4 సిక్సర్లతో అదరగొట్టాడు.

శార్దూల్ రంజీ ట్రోఫీ ఫైనల్ ఈ ఇన్నింగ్స్ చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఒకప్పుడు ముంబై జట్టు 30 పరుగుల వ్యవధిలో 6 వికెట్లు కోల్పోయింది. దీని తర్వాత శార్దూల్ ఒక ఎండ్‌ను హ్యాండిల్ చేయడమే కాకుండా కౌంటర్ అటాకింగ్ క్రికెట్ జట్టును 200 పరుగుల స్కోరుకు మించి తీసుకెళ్లాడు.

తొలిరోజు ఆట ముగిసే సరికి..

తొలి రోజు ఆట ముగిసే సమయానికి విధర్బ జట్టు 3 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. మరో 193 పరుగుల వెనుకజంలో నిలిచింది. అతర్వ 21 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో శార్దుల్ 1 వికెట్, కులకర్ణి 2 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..