INDIA VS ENGLAND 2021: తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైన భారత్.. నాటౌట్‌గా నిలిచిన రిషబ్‌ పంత్‌

|

Feb 14, 2021 | 11:02 AM

ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం 300/6తో రెండో రోజు ఆట కొనసాగించిన కోహ్లీసేన మరో 29 పరుగులు

INDIA VS ENGLAND 2021: తొలి ఇన్నింగ్స్‌లో 329 పరుగులకు ఆలౌటైన భారత్.. నాటౌట్‌గా నిలిచిన రిషబ్‌ పంత్‌
Follow us on

ఇన్నింగ్స్‌లో భారత్‌ 329 పరుగులకు ఆలౌటైంది. ఆదివారం 300/6తో రెండో రోజు ఆట కొనసాగించిన కోహ్లీసేన మరో 29 పరుగులు జోడించి చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. యువ బ్యాట్స్‌మన్‌ రిషభ్‌పంత్‌ (58; 77 బంతుల్లో 7×4, 3×6) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. రెండోరోజు తొలి ఓవర్‌లోనే మోయిన్‌ అలీ.. అక్షర్‌ పటేల్‌(5), ఇషాంత్‌(0)ను ఔట్‌ చేసి భారత్‌కు షాకిచ్చాడు. అయితే, కుల్‌దీప్‌(0)తో కాసేపు బ్యాటింగ్‌ చేసిన పంత్‌ బౌండరీలతో చెలరేగాడు. ఈ క్రమంలోనే 65 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, స్టోన్‌ వేసిన 96వ ఓవర్‌లో కుల్‌దీప్‌, సిరాజ్‌(4) ఔటవ్వడంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. శనివారం టాస్‌ గెలిచిన కోహ్లీ బ్యాటింగ్‌ ఎంచుకోగా, రోహిత్‌(161), రహానె(67) రాణించిన సంగతి తెలిసిందే.

బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ తన‌ తొలి ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఇషాంత్‌ వేసిన బంతి లెగ్‌స్టంప్‌వైపు వెళుతున్నట్లు కనిపించడంతో బర్న్స్‌ అంపైర్‌ను రివ్యూ కోరాడు. అయితే డీఆర్‌ఎస్‌లో బంతి వికెట్లను తాకుతూ వెళ్లడం.. అంపైర్‌ నిర్ణయం సరైందేనని తేలడంతో ఇంగ్లండ్‌ ఒక రివ్యూను కోల్పోయింది. దీంతో బర్న్స్‌ డకౌట్‌గా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌ సున్నా పరుగుకే ఒక వికెట్‌ కోల్పోయింది.

INDIA VS ENGLAND 2021: థర్డ్ అంపైరే తప్పు చేస్తే ఇక దిక్కెవరూ..! చెన్నై టెస్ట్‌లో ఆసక్తికర ఘటన..