0,0,0,0,0,0,0,0,0.. ఎవర్రా మీరంతా.. టీ20ల్లోనే చెత్త మ్యాచ్.. 6 పరుగులకే ఆలౌట్.. అందులోనూ

T20I Records: ఈ టీ20 మ్యాచ్‌లో, జట్టు నుంచి ఒకే ఒక్క ప్లేయర్ ఒక్క పరుగు మాత్రమే చేసింది. అంతేకాకుండా, 5 పరుగులు అదనంగా వచ్చాయి. దాదాపు అందరు ఆటగాళ్లు తమ ఖాతా తెరవలేకపోయారు. మొత్తం మీద, జట్టు కేవలం ఆరు పరుగులకే ఆలౌట్ అయింది. రువాండా బౌలింగ్ గురించి చెప్పాలంటే, ఫాస్ట్ బౌలర్ జోసిన్ నైరంకుండినెజా ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు అద్భుతమైన వికెట్లు పడగొట్టింది.

0,0,0,0,0,0,0,0,0.. ఎవర్రా మీరంతా.. టీ20ల్లోనే చెత్త మ్యాచ్.. 6 పరుగులకే ఆలౌట్.. అందులోనూ
T20i Records

Updated on: Oct 22, 2025 | 12:10 PM

Rwanda vs Mali: టీ20 క్రికెట్ అనేది ప్రతి బంతితో మ్యాచ్ ఉత్సాహంతోపాటు టెన్షన్ పెంచే ఫార్మాట్‌గా మారింది. కొన్నిసార్లు టీ20 క్రికెట్ అధిక స్కోర్‌లు నమోదవుతుంటాయి. మరికొన్నిసార్లు జట్లు చాలా తక్కువ స్కోర్‌లకే ఆలౌట్ అవుతుంటాయి. ఒక టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఇలాంటిదే జరిగింది. అక్కడ మొదట బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు కేవలం 6 పరుగులకే ఆలౌట్ అయి అవమానకరమైన ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్ ఎప్పుడు, ఎవరి మధ్య జరిగిందో వివరంగా వివరిద్దాం తెలుసుకుందాం..

కేవలం 6 పరుగులకే ఆలౌట్..

టీ20 క్రికెట్‌లో, ఆటగాళ్ళు త్వరగా స్కోర్ చేయడానికి ప్రయత్నిస్తారనే విషయంత తెలిసిందే. తరచుగా వేగంగా పరుగులు చేసేందుకు ప్రయత్నించి చాలా జట్లు తక్కువ పరుగులకే ఆలౌట్ అవుతుంటాయి. ఒక జట్టు కేవలం ఆరు పరుగులకే ఆలౌట్ కావడం వింతగా అనిపించవచ్చు. కానీ ఇది నిజంగా జరిగింది. మహిళల టీ20 మ్యాచ్‌లో, రువాండా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో మాలి మహిళా జట్టు 6 పరుగులకే ఆలౌట్ అయింది.

రువాండా వర్సెస్ మాలి మధ్య జరిగిన ఈ టీ20 మ్యాచ్‌లో, రువాండా మహిళలు మాలి మహిళలను కేవలం 6 పరుగులకే ఆలౌట్ చేశారు. ఆ జట్టు కేవలం నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుంది.

ఇవి కూడా చదవండి

మ్యాచ్ ఎలా ఉందంటే..

రువాండా వర్సెస్ మాలి మహిళల జట్ల మధ్య జరిగిన ఈ టీ20 మ్యాచ్ గురించి చెప్పాలంటే, ఇది జూన్ 18, 2019న విబుకాలో జరిగింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మాలి మహిళలు 9 ఓవర్లలో కేవలం 6 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఓపెనర్ సమెక్ 6 బంతుల్లో ఒక పరుగు చేసింది. మరే ఇతర బ్యాటర్ కూడా ఖాతా తెరవలేకపోయారు.

ఒకరు తప్ప మిగతా ఆటగాళ్లంతా సున్నాకే ఔట్..

ఈ టీ20 మ్యాచ్‌లో, జట్టు నుంచి ఒకే ఒక్క ప్లేయర్ ఒక్క పరుగు మాత్రమే చేసింది. అంతేకాకుండా, 5 పరుగులు అదనంగా వచ్చాయి. దాదాపు అందరు ఆటగాళ్లు తమ ఖాతా తెరవలేకపోయారు. మొత్తం మీద, జట్టు కేవలం ఆరు పరుగులకే ఆలౌట్ అయింది. రువాండా బౌలింగ్ గురించి చెప్పాలంటే, ఫాస్ట్ బౌలర్ జోసిన్ నైరంకుండినెజా ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మూడు అద్భుతమైన వికెట్లు పడగొట్టింది.

మాలి నిర్దేశించిన 7 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రువాండా కేవలం నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఆ విధంగా, రువాండా ఇంకా 116 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్‌ను గెలుచుకుంది. దీంతో మాలికి అవమానకరమైన ఓటమి ఎదురైంది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..