టీ 20 వరల్డ్ కప్ లో భారత జట్టుకు సహాయపడేందుకు ఎనిమిది మంది క్రీడాకారులు బీసీసీఐ ప్రకటించింది. ఆ 8 మంది టీమ్ ఇండియా బయో బబుల్‌లో చేరతారని ప్రకటించింది. అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మన్ మెరివాలా, వెంకటేష్ అయ్యర్, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, కె. గౌతమ్ అతి త్వరలో బయో బబుల్‌లో చేరతారని బీసీసీఐ తెలిపింది. వీరు నెట్ బౌలర్లు, సహాయకులుగా ఉంటారని చెప్పింది.
హర్షల్ పటేల్, అవేశ్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్, వెంకటేష్ అయ్యర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో ఆకట్టుకున్నారు. ఐపీఎల్ 2021లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాల్లో హర్షల్ కీలక పాత్ర పోషించాడు. ఈ హర్యానా ఫాస్ట్ బౌలర్ 32 వికెట్లు, టీ 20 టోర్నమెంట్ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన డ్వేన్ బ్రావో ఆల్ టైమ్ రికార్డును సమం చేశాడు.
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న అవేష్ ఖాన్ కచ్చితమైన పేస్‌తో ఆకట్టుకున్నాడు. 15 మ్యాచ్‌ల్లో 23 వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా పేసర్లు అన్రిచ్ నార్జే, కగిసో రబాడతో కలిసి
చక్కటి బౌలింగ్ చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్ రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ఐపీఎల్-2021 రెండో దశలో మెరుగ్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. మధ్యస్థ పేస్‌తో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ పేస్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్, వకార్ యూనిస్‌ని గుర్తు చేశాడు. 150 కి.మీ. వేగంతో స్థిరంగా బౌలింగ్ చేస్తున్నాడు.ఈ సీజన్ ప్రారంభంలో అతను 152 కిలోమీటర్ల వేగంతో ఐపీఎల్-2021లో వేగవంతమైన బంతిని బౌల్ చేశాడు.
లుక్మన్ మెరివాలా తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జట్టులో సన్నాహాల్లో సహకరించడానికి కర్న్ శర్మ, షాబాజ్ అహ్మద్, గౌతమ్‌ని చేర్చడం ఆశ్చర్యకరంగా ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరఫున కొన్ని మ్యాచులు ఆడగా.. గౌతమ్, శర్మలకు చెన్నై సూపర్ కింగ్స్‌లో ఆడే అవకాశం రాలేదు.