భారత్‌లో పుట్టాడు.. విదేశీ జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు.. కట్ చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ విన్నర్‌..

|

Oct 21, 2022 | 1:04 PM

ముఖ్యంగా ఈ టోర్నమెంట్‌లో పలువురు యువ ఆటగాళ్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. అందులో ఒకరు సూర్యకుమార్ యాదవ్.

భారత్‌లో పుట్టాడు.. విదేశీ జట్టుకు కెప్టెన్‌ అయ్యాడు.. కట్ చేస్తే.. టీ20 ప్రపంచకప్‌లో మ్యాచ్ విన్నర్‌..
Cp Rizwan
Follow us on

టీ20 ప్రపంచకప్ 2022లో సూపర్ 12 లీగ్ స్టేజి ఇంకా మొదలు కావాల్సి ఉంది. భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా వంటి పెద్ద జట్ల హైవోల్టేజీ మ్యాచ్‌ల కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా వేచి చూస్తున్నారు. ముఖ్యంగా ఈ టోర్నమెంట్‌లో పలువురు యువ ఆటగాళ్లతో టీమిండియా బరిలోకి దిగుతోంది. అందులో ఒకరు సూర్యకుమార్ యాదవ్. స్కై ఒక్కసారి రెచ్చిపోతే.. ప్రత్యర్ధులకు చుక్కలే. అతడి బ్యాటింగ్ చూసేందుకు ఎదురు చూస్తుండగా.. తాజాగా స్కై తరహా షాట్స్‌తో ఓ బ్యాటర్ రెచ్చిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 29 బంతుల్లో అజేయంగా 43 పరుగులు చేశాడు యూఏఈ కెప్టెన్ సీపీ రిజ్వాన్. అతడు కొట్టిన షాట్స్.. స్కై బ్యాటింగ్‌ను తలపించాయి. టీ20 ప్రపంచకప్‌ నుంచి యూఏఈ జట్టు ఇప్పటికే సూపర్-12 రేసు నుండి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయితే నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం యూఏఈ 7 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది.

సూర్యను గుర్తు చేసిన రిజ్వాన్..

యూఏఈ కెప్టెన్ రిజ్వాన్ బ్యాటింగ్ అందరికీ సూర్యను గుర్తు చేసింది. నమీబియాతో జరిగిన చివరి గ్రూప్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు 3 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఫలితంగా నమీబియా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఒకానొక సమయంలో యూఏఈ 148 పరుగులకు చేరుకోవడం కష్టమైనప్పటికీ, రిజ్వాన్ అజేయ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. 43 పరుగులతో తన ఇన్నింగ్స్‌లో రిజ్వాన్ 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో రాణించాడు. సరిగ్గా సూర్యకుమార్ తరహాలో షాట్స్ ఆడాడు.