T20 World Cup: వేతనం లేకుండా ధోని సేవలు.. తెలిపిన బీసీసీఐ కార్యదర్శి..

|

Oct 12, 2021 | 8:14 PM

అక్టోబర్ 17 నుంచి యూఏఈ, ఒమన్ ప్రారంభమయ్యే టీ 20 వరల్డ్ కప్‌లో భారత క్రికెట్ జట్టు మెంటార్‌గా ఎంఎస్ ధోనీని నియమించిన విషయం తెలిసిందే.. అయితే ధోని మెంటార్‌గా పని చేస్తున్నందుకు గౌరవ వేతనం తీసుకోవడం లేదని బీసీసీఐ కార్యదర్శి జే షా తెలిపారు...

T20 World Cup: వేతనం లేకుండా ధోని సేవలు.. తెలిపిన బీసీసీఐ కార్యదర్శి..
Dhoni
Follow us on

అక్టోబర్ 17 నుంచి యూఏఈ, ఒమన్ ప్రారంభమయ్యే టీ 20 వరల్డ్ కప్‌లో భారత క్రికెట్ జట్టు మెంటార్‌గా ఎంఎస్ ధోనీని నియమించిన విషయం తెలిసిందే.. అయితే ధోని మెంటార్‌గా పని చేస్తున్నందుకు గౌరవ వేతనం తీసుకోవడం లేదని భారత క్రికెట్ కంట్రోల్ (బీసీసీఐ) కార్యదర్శి జే షా మంగళవారం తెలిపారు. మాజీ కెప్టెన్ ప్రపంచ కప్ సమయంలో జట్టుకు సేవ చేయడానికి అంగీకరించినందున ఎంఎస్ ధోనికి BCCI కృతజ్ఞతలు తెలిపింది. గత నెలలో జట్టును ప్రకటించినప్పుడు టీ20 వరల్డ్ కప్ కోసం మాత్రమే భారత మాజీ కెప్టెన్ సేవలను BCCI తీసుకోనుందని చెప్పారు.

2007లో టీ 20 ప్రపంచకప్ ప్రారంభ ఎడిషన్‌లో దేశానికి గొప్ప కీర్తిని తెచ్చిన ధోనీ ఆగష్టు 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 40 ఏళ్ల అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఆడుతూనే ఉన్నాడు. ధోని ఐపీఎల్-2021 పూర్తయిన తర్వాత భారత జట్టులో చేరతాడు. సీఎస్కేను ఫైనల్ చేర్చడంలో ధోనీ విజయవంతమయ్యాడు.

ప్రకటన చేయడానికి రెండు నెలల ముందుగానే ఎంఎస్ ధోనీ సేవాల్ని ఉపయోగించుకోవాలని ఆలోచించినట్లు జయ్ షా చెప్పారు. టీ 20 ప్రపంచకప్‌లో తన పాత్ర గురించి స్పష్టత వచ్చిన తర్వాత ధోనీ ఈ ప్రతిపాదనకు అంగీకరించాడని తెలిపారు. దీనిపై కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మలను సంప్రదించినట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 24 న దుబాయ్‌లో పాకిస్థాన్‎తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు టీ 20 వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్ ఆడనుంది.

Read Also… T20 World Cup 2021: నిన్న ఉమ్రాన్ మాలిక్.. నేడు అవేష్ ఖాన్‎.. టీం ఇండియా నెట్ బౌలర్లుగా ఎంపిక..!