T20 World Cup 2021, IND vs SCO Match Result: సూపర్ 12లో గ్రూపు2 డబుల్ హెడర్ మ్యాచుల్లో భాగంగా రెండో గేమ్‌లో భారత్ వర్సెస్ స్కాట్లాండ్ టీంలు తలపడుతున్నాయి. అయితే కీలక మ్యాచులో భారీ విజయం సాధించాల్సిన మ్యాచులో టాస్ గెలిచిన భారత్.. ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో స్కాట్లాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. స్కాట్లాండ్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 85 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో కోహ్లీసేన ముందు 86 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో ఛేజింగ్ చేసిన భారత్ కేవలం 6.3 ఓవర్లలో టార్గెట్‌ను పూర్తి చేసింది. ఓపెనర్లుగా వచ్చిన రోహిత్ శర్మ30(16 బంతులు, 5 ఫోర్లు, 1సిక్స్), కేఎల్ రాహుల్ 50(18 బంతులు, 6 ఫోర్లు, 3 సిక్సులు) పరుగులతో సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడారు. అయితే రోహిత్ ఎల్బీగా పెవిలియన్ చేరిన తరువాత బర్త్‌డే బాయ్ కోహ్లీ(2) బ్యాటింగ్‌కు వచ్చాడు. అనంతరం అర్థ సెంచరీ పూర్తి చేశాక భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన కేఎల్ రాహుల్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం సూర్య కుమార్ (6) సిక్స్‌తో టార్గెట్‌ను సాధించారు. దీంతో గ్రూపు2లో పాయింట్ల పట్టికలో భారత్ మొత్తం 4 మ్యాచుల్లో 2 విజయాలు, 2 పరాజయాలతో మూడో స్థానానికి చేరింది. ఇక కీలకమైన నెట్ రన్ రేట్‌లో +1.619 తో టాప్‌లో నిలిచింది. ఇక ప్రస్తుతం భారత్ సెమీ ఫైనల్స్ చేరాలంటే న్యూజిలాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌పైన ఆధారపడి ఉంది. ఈ మ్యాచులో ఆఫ్ఘనిస్తాన్ టీం గెలిస్తేనే భారత్ సెమీ ఫైనల్ చేరుకుంటుంది.
భారత బౌలింగ్ లైనప్ దెబ్బకు స్కాట్లాండ్ టీం వరుసగా వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వద్ద స్కాట్లాండ్ టీం తొలి వికెట్‌ను కోల్పోయింది. బుమ్రా వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కోయోట్టర్(1) బౌల్డయ్యాడు. అనంతరం 24(19 బంతులు, 4 ఫోర్లు, 1 సిక్స్) పరుగులు చేసిన మరో ఓపెనర్ జార్జ్ మున్సీ రెండో వికెట్‌గా షమీ బౌలింగ్‌లో హార్దిక్ అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. మాథ్యూ క్రాస్ (2), రిచీ బెరింగ్టన్ (0) లను ఒకే ఓవర్లో రవీంద్ర జడేజా పెవిలియన్ చేర్చి స్కాట్లాండ్‌ను భారీ దెబ్బ తీశాడు.
58 పరుగుల వద్ద ఐదో వికెట్ రూపంలో లీస్క్ వెనుదిరిగాడు. జడేజా బౌలింగ్‌లో లీస్క్(21 పరుగులు, 12 బంతులు, 2 ఫోర్లు, 1సిక్స్) ఎల్బీగా వెనుదిరిగాడు. అనంతరం అశ్విన్ దెబ్బకు స్కాట్లాండ్ ఆరో వికెట్‌ను కోల్పోయింది. క్రిస్ గ్రీవ్స్(1) భారీ షాట్ ఆడబోయి హార్ధిక్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అనంతరం సఫ్యాన్ షరీఫ్ 0, ఎవాన్స్ 0, క్రిస్ గ్రీవ్స్ 1, ఎవాన్స్ 0 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. షమీ వేసిన 17వ ఓవర్లో స్కాట్లాండ్ టీం వరుసగా మూడు బంతుల్లో మూడు వికెట్లను కోల్పోయింది.
టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరే అవకాశాలను ఏదో విధంగా కాపాడుకుంటూ వస్తున్న టీమ్ ఇండియాకు శుక్రవారం చాలా ముఖ్యమైన రోజు. సెమీఫైనల్‌లో ఇతర జట్ల ప్రదర్శనపైనే ఆధారపడిన కోహ్లీ సేన ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలుపొందాలనే ఉద్దేశంతో స్కాట్లాండ్‌తో మ్యాచ్‌కు సిద్ధమైన సంగతి తెలిసిందే. అఫ్గానిస్థాన్‌పై 66 పరుగుల తేడాతో విజయం సాధించిన తర్వాత ఆ జోరును కొనసాగించడంపైనే భారత్ దృష్టి సారించింది. భారత్ విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవడానికి భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది.
India unleash the ?#T20WorldCup | #INDvSCO | https://t.co/YLpksRuLCt pic.twitter.com/LQtId9BeeB
— ICC (@ICC) November 5, 2021
What a bowler ?
Jasprit Bumrah is now India’s leading wicket-taker in Men’s T20Is ?#T20WorldCup | #INDvSCO pic.twitter.com/M2lZvJpWlO
— ICC (@ICC) November 5, 2021
Also Read: