T20 World Cup 2021: న్యూజిలాండ్‎పై ఓటమికి మానసిక అలసటే కారణం.. అందుకే సరిగా ఆడలేదు.. రవి శాస్త్రి..

టీ20 వరల్డ్ కప్ 2021కి ముందు నెలల తరబడి బయో బబుల్స్‌లో ఉండడం వల్ల మానసిక అలసట కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‎లో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే ఆడలేదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు...

T20 World Cup 2021: న్యూజిలాండ్‎పై ఓటమికి మానసిక అలసటే కారణం.. అందుకే సరిగా ఆడలేదు.. రవి శాస్త్రి..
Ravi Shastri

Updated on: Nov 12, 2021 | 8:37 PM

టీ20 వరల్డ్ కప్ 2021కి ముందు నెలల తరబడి బయో బబుల్స్‌లో ఉండడం వల్ల మానసిక అలసట కారణంగా న్యూజిలాండ్‌తో జరిగిన సూపర్ 12 మ్యాచ్‎లో భారత ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే ఆడలేదని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అన్నారు. ఇది టోర్నమెంట్ నుండి ముందుగానే నిష్క్రమించడానికి దారితీసిందని చెప్పారు. రెండు ఓటముల అనంతరం ఆఫ్ఘనిస్తాన్, స్కాట్లాండ్, నమీబియాపై ఇండియా విజయం సాధించింది. సెమీఫైనల్‌కు చేరుకుండానే ఇంటి ముఖం పట్టింది. పాకిస్తాన్‌పై మ్యాచ్‎లో భారత్ 151 పరుగులు చేసింది. కానీ కివీస్‎తో జరిగిన మ్యాచ్‎లో 111 పరుగులే చేసింది.

దీనిపై శాస్త్రి చాలా ఆసల్యంగా స్పందించాడు పాకిస్తాన్, న్యూజిలాండ్‌పై ఓడిపోవడానికి మానసిక అలసట ఒక పెద్ద కారణమని శాస్త్రి చెప్పాడు. అయితే టోర్నమెంట్ నుండి నిష్క్రమణకు తాను సాకులు చెప్పడం లేదని స్పష్టం చేశాడు. “నేను అనుకుంటున్నాను, పాకిస్తాన్, మాకు బోర్డు మీద పరుగులు వచ్చాయి. కానీ న్యూజిలాండ్‌పై సరిగా ఆడలేదు.” శాస్త్రి చెప్పాడు. “మాకు ధైర్యం లేదు, మీరు మానసికంగా అలసిపోయినప్పుడు ఇది జరుగుతుంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో మాకు ధైర్యం లేకపోయిందని నేను చెబుతాను” అని ఓ వార్త సంస్థతో శాస్త్రి అన్నారు. T20 ప్రపంచ కప్‌తో భారత ప్రధాన కోచ్‌గా శాస్త్రి పదవీకాలం ముగిసింది. మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఇప్పుడు కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత్ త్వరలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‎ను ఆడనుంది. ఇందుకు సంబంధంచి భారత జట్టును బీసీసీ ఇప్పటికే ప్రకటించింది.

న్యూజిలాండ్ టీ20 సిరీస్‎కు భారత జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్-కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్-కీపర్), వెంకటేష్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, ఆర్ అశ్విన్, అక్సర్ పటేల్, అవేష్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్.

Read Also.. T20 World Cup 2021: డేవిడ్ వార్నర్ సిక్స్‎పై విమర్శలు.. సరైన పద్ధతి కాదని గౌతమ్ గంభీర్ వ్యాఖ్యలు..