T20 World Cup 2026 Poll: స్వ్కాడ్‌లతో పోరుకు సిద్ధం.. మరి మీ దృష్టిలో తోపు టీం ఏది..?

క్రికెట్ ప్రపంచంలోనే అత్యంత ఉత్కంఠభరితమైన పోరుకు రంగం సిద్ధమైంది. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ సమరానికి సంబంధించి ప్రధాన దేశాలు తమ తుది జట్లను ప్రకటించాయి. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి దిగ్గజ జట్లతో పాటు ఇటలీ వంటి వర్ధమాన జట్లు కూడా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా భారత్ బరిలోకి దిగుతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

T20 World Cup 2026 Poll: స్వ్కాడ్‌లతో పోరుకు సిద్ధం.. మరి మీ దృష్టిలో తోపు టీం ఏది..?
T20i World Cup 2026 Squads

Updated on: Jan 09, 2026 | 1:04 PM

టీ20 ప్రపంచ కప్ 2026 ఆరంభానికి గడువు దగ్గర పడుతుండటంతో ఐసీసీ (ICC) తో పాటు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్లను ఖరారు చేశాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు తలపడనున్నాయి.

టీమ్ ఇండియా (డిఫెండింగ్ ఛాంపియన్స్): భారత జట్టు యువత, అనుభవజ్ఞుల కలయికతో పటిష్టంగా కనిపిస్తోంది. గౌతమ్ గంభీర్ మార్గదర్శకత్వంలో భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకోవాలని చూస్తోంది. గాయం కారణంగా గత కొన్ని సిరీస్‌లకు దూరమైన కీలక ఆటగాళ్లు మళ్లీ జట్టులోకి రావడం భారత్‌కు పెద్ద సానుకూలాంశం. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో బ్యాటింగ్ లైనప్ భీకరంగా ఉంది.

ఇవి కూడా చదవండి

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వ్యూహాలు: మరోవైపు ఆస్ట్రేలియా తన వేగవంతమైన బౌలింగ్ విభాగంతో పాటు విధ్వంసకర ఆల్‌రౌండర్లను నమ్ముకుంది. ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ వంటి ఆటగాళ్లు జట్టుకు ప్రధాన బలంగా మారారు. ఇంగ్లాండ్ జట్టు తమ ‘బాజ్‌బాల్’ తరహా దూకుడును టీ20ల్లోనూ కొనసాగించేలా పక్కా ప్లాన్‌తో కనిపిస్తోంది.

పాకిస్థాన్, సౌతాఫ్రికా: పాకిస్థాన్ జట్టు బాబర్ ఆజం సారధ్యంలో బౌలింగ్ విభాగంపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. గతేడాది ఫైనల్ వరకు వెళ్లిన సౌతాఫ్రికా, ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో క్వింటన్ డికాక్, క్లాసెన్ వంటి పవర్‌ఫుల్ హిట్టర్లతో బరిలోకి దిగుతోంది.

మెగా టోర్నీలో కొత్త జట్లు: ఈసారి వరల్డ్ కప్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న జట్టు ఇటలీ. యూరప్ క్వాలిఫైయర్స్‌లో అద్భుత ప్రదర్శన చేసి అర్హత సాధించిన ఈ జట్టు, పెద్ద జట్లకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. అలాగే ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లు కూడా తమదైన రోజున ఏ జట్టునైనా ఓడించగల సత్తా ఉన్న ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.

ముఖ్యమైన తేదీలు: ఈ టోర్నీ ఫిబ్రవరి 2026లో ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నీ జరగనుంది. గ్రూప్ దశ మ్యాచ్‌ల అనంతరం సూపర్-8, ఆపై సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడే మ్యాచ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి 2026 టీ20 ప్రపంచ కప్ గతంలో కంటే మరింత రసవత్తరంగా సాగనుంది. పసికూనలు సైతం పంజా విసిరేందుకు సిద్ధమవుతున్న తరుణంలో, ఈసారి విజేతగా ఎవరు నిలుస్తారో వేచి చూడాలి.

ఇప్పటి వరకు విడుదలైన స్వ్కాడ్‌లు..

భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, రింకు సింగ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చకరవర్తి, వాషింగ్టన్ సుందర్, ఇషాన్ కిషన్.

నమీబియా: గెర్‌హార్డ్ ఎరాస్మస్ (కెప్టెన్), జేన్ గ్రీన్, బెర్నార్డ్ స్కోల్ట్జ్, రూబెన్ ట్రంపెల్‌మన్, జెజె స్మిత్, జాన్ ఫ్రైలింక్, లౌరెన్ స్టీన్‌క్యాంప్, మలన్ క్రుగర్, జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్, జాక్ బ్రాసెల్, బెన్ షికోంగో, జాన్ బాల్ట్, డైలన్ మైబర్గ్ లీచెర్. రిజర్వ్: అలెగ్జాండర్ బసింగ్-వోల్స్చెంక్.

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, కూపర్ కొన్నోల్లీ, పాట్ కమ్మిన్స్, టిమ్ డేవిడ్, కామెరాన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ షార్ట్, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.

శ్రీలంక (ప్రాధమిక జట్టు): దసున్ షనక (కెప్టెన్), పాతుమ్ నిస్సాంక, కుసల్ మెండిస్, కమిల్ మిషార, కుసల్ పెరీరా, ధనంజయ డి సిల్వా, నిరోషన్ డిక్‌వెల్లా, జనిత్ లియానాగే, చరిత్ అసలంక, కమిందు మెండిస్, పవన్ రత్నాకే, వాహన్ అరాచ్చిగే, వాహన్ అరాచ్చిగెస్ రత్నాయక్, నువాన్ తుషార, ఎషాన్ మలింగ, దుష్మంత చమీర, ప్రమోద్ మధుషన్, మతీషా పతిరణ, దిల్షన్ మదుశంక, మహేశ్ తీక్షణ, దుషన్ హేమంత, విజయకాంత్ వియాస్కాంత్, ట్రావీన్ మాథ్యూ.

జింబాబ్వే: సికందర్ రజా (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, ర్యాన్ బర్ల్, గ్రేమ్ క్రీమర్, బ్రాడ్లీ ఎవాన్స్, క్లైవ్ మదాండే, టినోటెండా మపోసా, తడివానాషే మారుమణి, వెల్లింగ్టన్ మసకద్జా, టోనీ మున్యోంగా, తషింగా ముసెకివా, బ్లెస్సింగ్ డి మైగర్రావానీ, బ్రెడ్‌డాన్ మైగర్రాబానీ.

ఒమన్‌: జతీందర్‌ సింగ్‌ (కెప్టెన్‌), వినాయక్‌ శుక్లా, మహ్మద్‌ నదీమ్‌, షకీల్‌ అహ్మద్‌, హమ్మద్‌ మీర్జా, వసీం అలీ, కరణ్‌ సోనావాలే, ఫైసల్‌ షా, నదీమ్‌ ఖాన్‌, సుఫియాన్‌ మెహమూద్‌, జయ్‌ ఒడెద్రా, షఫీక్‌ జాన్‌, ఆశిష్‌ ఒడెద్రా, జితేన్‌ రామానంది, హస్నా అలీ.

ఇంగ్లాండ్: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, జోస్ బట్లర్, సామ్ కర్రాన్, లియామ్ డాసన్, బెన్ డకెట్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, జోష్ టంగ్, ల్యూక్ వుడ్.

బంగ్లాదేశ్: లిట్టన్ దాస్ (కెప్టెన్), తాంజిద్ హసన్, పర్వేజ్ హొస్సేన్ ఎమోన్, సైఫ్ హసన్, తౌహిద్ హృదయ్, షమీమ్ హొస్సేన్, క్వాజీ నూరుల్ హసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషద్ హొస్సేన్, నసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, తకీఫ్ తకిమ్, తకీఫ్ తకీమ్ ఉద్దీన్, షోరిఫుల్ ఇస్లాం.

నేపాల్: రోహిత్ పౌడెల్ (కెప్టెన్), దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే, కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్, సందీప్ జోరా, ఆరిఫ్ షేక్, బసీర్ అహమద్, సోంపాల్ కమీ, కరణ్ కెసి, నందన్ యాదవ్, గుల్షన్ ఝా, లలిత్ రాజ్‌బన్షి, షేర్ మల్లా, లోకేశ్ బి.

న్యూజిలాండ్: మిచెల్ సాంట్నర్ (కెప్టెన్), ఫిన్ అలెన్, మైఖేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డెవాన్ కాన్వే, జాకబ్ డఫీ, లాకీ ఫెర్గూసన్, మాట్ హెన్రీ, డారిల్ మిచెల్, ఆడమ్ మిల్నే, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రాచిన్ రవీంద్ర, టిమ్ సీఫెర్ట్, ఇష్ సోధి. రిజర్వ్: కైల్ జామిసన్.

దక్షిణాఫ్రికా: ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, డేవిడ్ మిల్లర్, డొనోవన్ ఫెరీరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, క్వేనా మఫాకా, లుంగి న్గిడి, జాసన్ స్మిత్, జార్జ్ లిండే, కార్బిన్ బోస్చ్, అన్రిచ్ నోర్ట్‌జే.

ఆఫ్ఘనిస్థాన్: రషీద్ ఖాన్ (కెప్టెన్), ఇబ్రహీం జద్రాన్, రహ్మానుల్లా గుర్బాజ్, మహ్మద్ ఇషాక్, సెడిఖుల్లా అటల్, దర్విష్ రసూలీ, షాహిదుల్లా కమల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, గుల్బాదిన్ నాయబ్, మహ్మద్ నబీ, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రహ్మాన్, ఎఫ్. అబ్దుల్లా అహ్మద్‌జాయ్. రిజర్వ్‌లు : ఏఎం ఘజన్‌ఫర్, ఇజాజ్ అహ్మద్‌జాయ్, జియా ఉర్ రెహ్మాన్ షరీఫీ.

కెనడా: నికోలస్ కిర్టన్ (కెప్టెన్), శ్రేయాస్ మొవ్వా, కలీమ్ సనా, అన్ష్ పటేల్, అజయ్‌వీర్ హుందాల్, జస్కరన్ సింగ్, హర్ష్ ఠాకర్, డిల్లాన్ హేలిగర్, సాద్ బిన్ జాఫర్, నవనీత్ ధాలివాల్, రవీందర్‌పాల్ సింగ్, శివం శర్మ, కన్వర్‌పాల్ తత్గూర్, దిల్‌ప్రీత్‌రాజ్ బాజ్, దిల్‌ప్రీత్ రాజ్.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..