T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఇలా.. ఆ 3 స్పెషాలిటీస్ ఏంటంటే?

3 Special Things in T20 World Cup History: టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన జట్లు అమెరికా, వెస్టిండీస్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. టీ20లో ఛాంపియన్‌గా ఎదగాలనే బలమైన కోరికతో రంగంలోకి దిగనున్నాయి. కాగా, ఈ పోరు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈసారి ప్రపంచకప్ గెలవడానికి చాలా జట్లు బలమైన పోటీదారులుగా బరిలోకి దిగనున్నాయి.

T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే తొలిసారి ఇలా.. ఆ 3 స్పెషాలిటీస్ ఏంటంటే?
T20 World Cup

Updated on: Jun 02, 2024 | 6:10 AM

3 Special Things in T20 World Cup History: టీ20 ప్రపంచ కప్ 2024 ప్రారంభానికి ఒక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ప్రస్తుతం ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన జట్లు అమెరికా, వెస్టిండీస్‌లో సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. టీ20లో ఛాంపియన్‌గా ఎదగాలనే బలమైన కోరికతో రంగంలోకి దిగనున్నాయి. కాగా, ఈ పోరు నెల రోజుల పాటు కొనసాగనుంది. ఈసారి ప్రపంచకప్ గెలవడానికి చాలా జట్లు బలమైన పోటీదారులుగా బరిలోకి దిగనున్నాయి. అయితే, ఈసారి ఏ జట్టు విజేతగా నిలుస్తుందో చెప్పలేం.

2007 నుంచి టీ20 ప్రపంచకప్‌ను నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 8 టోర్నీలు నిర్వహించారు. టీ20 ప్రపంచకప్‌ ప్రతి ఎడిషన్‌లోనూ కొత్తదనాన్ని అందిస్తున్నారు. ఈసారి కూడా అలాంటిదే కనిపిస్తోంది. T20 ప్రపంచ కప్ 2024 సందర్భంగా, టోర్నమెంట్ చరిత్రలో గతంలో ఎన్నడూ జరగని మూడు కొత్త విషయాలను అభిమానులు చూడనున్నారు.

2024 T20 ప్రపంచ కప్‌లో ఈ 3 విషయాలు మొదటిసారిగా కనిపిస్తాయి..

1. అమెరికాలో తొలిసారి టీ20 వరల్డ్ కప్ నిర్వహణ..

ఈసారి టీ20 ప్రపంచకప్‌ కూడా ప్రత్యేకం. ఎందుకంటే తొలిసారిగా అమెరికాలో ఇంత పెద్ద క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నారు. అమెరికా క్రికెట్‌కు ప్రసిద్ధి కాదు. ఇతర క్రీడలు అక్కడ ఎక్కువ ప్రసిద్ధి చెందాయి. అయితే అక్కడ కూడా క్రికెట్‌ను వ్యాప్తి చేయాలనే ఉద్దేశ్యంలో అమెరికాలో ఇంత పెద్ద ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు. ప్రపంచకప్ గురించి పెద్దగా తెలియని దేశంలో నిర్వహించడం క్రికెట్ ప్రపంచానికి పెద్ద విషయమే.

2. మొదటిసారిగా టోర్నమెంట్‌లో 20 జట్లు..

ఈసారి జరిగే టీ20 ప్రపంచకప్‌ ఫార్మాట్‌లో ఇప్పటి వరకు అతిపెద్ద ప్రపంచకప్‌గా పిలుస్తున్నారు. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇంతకుముందు ఇన్ని జట్లు T20 ప్రపంచ కప్‌లో పాల్గొనలేదు. కానీ ఈసారి అది జరుగుతోంది. పపువా న్యూ గినియా, అమెరికా, నేపాల్, కెనడా, ఉగాండా వంటి జట్లు కూడా ఈసారి టీ20 ప్రపంచకప్‌లో ఆడుతున్నాయి.

3. న్యూయార్క్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్..

ఇప్పటి వరకు ప్రపంచంలోని పలు నగరాల్లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగగా, ఈసారి టీ20 ప్రపంచకప్ సందర్భంగా న్యూయార్క్ లాంటి పెద్ద నగరంలో నిర్వహించనున్నారు. న్యూయార్క్‌లో పెద్ద సంఖ్యలో భారతీయులు, పాకిస్థానీయులు నివసిస్తున్నారు. అందుకే స్టేడియం పూర్తిగా నిండిపోతుంది. ఈ సారి టిక్కెట్లకు డిమాండ్ కూడా ఎక్కువగా ఉండడంతో ఒక్కో టిక్కెట్టు రూ.2 లక్షలకు విక్రయించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..