ICC T20 World Cup Records: ప్రపంచ టీ20 క్రికెట్‌లో అనేక ప్రత్యేక రికార్డులు సృష్టించబడ్డాయి. ఈ రికార్డులు కూడా చాలా ఆశ్చర్యకరమైనవి. ప్రపంచంలో మొట్టమొదటి టీ20 మ్యాచ్ 2004 లో ఆక్లాండ్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి స్నేహపూర్వక టీ20 మ్యాచ్. ఈ ఫార్మాట్‌పై పెరుగుతున్న ప్రజాదరణతో, ఇది అంతర్జాతీయ క్రికెట్‌లో చేర్చాలని నిర్ణయించారు. దీనిని ప్రజలను ఎంతో ఆకర్షించింది. టీ20 క్రికెట్ చరిత్రలో కొన్ని అద్భుతమైన రికార్డులను చూద్దాం.
అత్యధిక పరుగులు: టీ 20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగుల గురించి మాట్లాడుతూ, ఈ రికార్డు శ్రీలంకకు చెందిన మహేల జయవర్ధనే పేరు మీద నమోదైంది. అతను 31 ఇన్నింగ్స్‌లలో 39.07 సగటుతో 6 అర్ధ సెంచరీలు, 1 సెంచరీతో 1,016 పరుగులు సాధించాడు. అయితే టీ 20 ప్రపంచకప్‌లో టాప్ 5 జాబితాలో టీమిండియా నుంచి విరాట్ కోహ్లీ మాత్రమే ఉన్నాడు. అతను 16 మ్యాచ్‌లలో 86.33 సగటుతో 777 పరుగులు చేశాడు.
అత్యధిక స్కోరు: టీ 20 ప్రపంచకప్‌లో బ్రెండన్ మెకల్లమ్ అత్యధిక వ్యక్తిగత స్కోరును కలిగి ఉన్నారు. 2012 లో బంగ్లాదేశ్‌పై మెకల్లమ్ 58 బంతుల్లో 123 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 11 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది.
అత్యధిక సెంచరీలు: టీ 20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ టీ 20 లెజెండ్ క్రిస్ గేల్ అత్యధిక సెంచరీలు చేశాడు. టీ 20 ప్రపంచకప్‌లో గేల్ రెండు సెంచరీలు చేశాడు. సెంచరీల జాబితాలో ఇతర దేశాల ఆటగాళ్లు ఆరుగురు ఆటగాళ్లు ఒక్కో సెంచరీని కలిగి ఉన్నారు.
వేగవంతమైన సెంచరీ: క్రిస్ గేల్ 2016 లో ఇంగ్లండ్‌పై 48 బంతుల్లో సెంచరీ సాధించాడు.
వేగవంతమైన యాభై: 2007 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై యువరాజ్ సింగ్ ఒక ఓవర్‌లో 6 సిక్సర్లు సాధించాడు. దీంతో యూవీ కేవలం 12 బంతుల్లో వేగవంతమైన అర్ధ సెంచరీ చేసిన రికార్డును సృష్టించాడు.
అత్యధిక భాగస్వామ్యం: 2010 ప్రపంచకప్‌లో వెస్టిండీస్‌పై జయవర్ధనే, సంగక్కర జంట రెండో వికెట్‌కు 166 పరుగులు చేశారు. టీ 20 ప్రపంచకప్‌లో ఇదే అతిపెద్ద భాగస్వామ్యంగా నమోదైంది.
అత్యధిక హాఫ్ సెంచరీలు: మాథ్యూ హేడెన్, విరాట్ కోహ్లీ 28 అర్ధ సెంచరీలతో అగ్రస్థానంలో నిలిచారు.
టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు: టీ 20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. 2014 టీ 20 ప్రపంచకప్‌లో అతను 6 ఇన్నింగ్స్‌లలో 319 పరుగులు చేశాడు.
అత్యధిక సిక్సర్లు: టీ 20 ప్రపంచకప్‌లో క్రిస్ గేల్ 60 సిక్సర్లు కొట్టాడు.