T20 World Cup 2021: రేపటి నుంచే మహా సంగ్రామం.. ఫార్మాట్, ప్రైజ్‌మనీ, షెడ్యూల్ లాంటి పూర్తి వివరాలు మీకోసం..!

|

Oct 16, 2021 | 3:35 PM

T20 World Cup 2021 Schedule, Prize Money: ఐదేళ్ల విరామం తరువాత మరలా టీ20 ప్రపంచ కప్ మహా సంగ్రామం జరగనుంది. ఇందులో ఈసారి అత్యధికంగా 16 జట్లు తలపడనున్నాయి.

T20 World Cup 2021: రేపటి నుంచే మహా సంగ్రామం.. ఫార్మాట్, ప్రైజ్‌మనీ, షెడ్యూల్ లాంటి పూర్తి వివరాలు మీకోసం..!
Icc Men's T20 World Cup 2021
Follow us on

T20 World Cup Live Streaming Details: ఐపీఎల్ 2021 కోలాహలం ముగిసింది. క్రికెట్ ప్రేమికులకు మరో క్రీడా సంబురం ఆహ్వానం పలకనుంది. యూఏఈ వేదికగా రేపటి నుంచి ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీలు మొదలుకానున్నాయి. అయితే ఈ సందర్భంగా టీ 20 ప్రపంచ కప్‌ ప్రైజ్ మనీ, ఎన్ని జట్లు, ఎన్ని వేదికలలో ఆడనున్నాయో లాంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

టీ20 ప్రపంచ కప్ ఎన్నేళ్ల తరువాత జరుగుతుంది. ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది?
ఐదేళ్ల విరామం తర్వాత మరలా టీ20 ప్రపంచకప్ జరుగుతోంది. ఈ మెగా టోర్నమెంట్ అక్టోబర్ 17 న డబుల్ హెడర్‌తో ప్రారంభమవుతుంది. తొలి గేమ్‌లో ఒమన్‌ వర్సెస్ పాపువా న్యూ గినియాతో తలపడుతుంది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వర్సెస్ స్కాట్లాండ్‌తో తలపడుతుంది. ఫైనల్ మ్యాచ్ నవంబర్ 14 న జరుగుతుంది.

ఈసారి హోస్ట్‌ చేసేది ఎవరు?
టీ20 ప్రపంచ కప్‌ 2021ను ఈ సారి బీసీసీఐ ఆతిథ్యమిస్తుంది. కానీ, మ్యాచ్‌లు మాత్రం యూఏఈ, ఒమన్‌లో జరగనున్నాయి. దేశంలోని కోవిడ్ -19 పరిస్థితి మేరకు టోర్నమెంట్‌ను భారతదేశం నుంచి యూఏఈకు తరలించారు.

టోర్నమెంట్‌లో ఎన్ని జట్లు పాల్గొటున్నాయి?
టీ20 ప్రపంచ కప్ 2021లో ఈ సారి అత్యధికంగా 16 జట్లు పాల్గొంటున్నాయి. ఐపీఎల్ 2021లో పోటీ పడిన టీంల సంఖ్య కంటే రెండింతలు ఉండడం విశేషం.

ఫార్మాట్ ఎలా ఉంది?
టోర్నమెంట్ రెండు రౌండ్లలో జరుగుతుంది. మొదటి రౌండ్‌లో ఎనిమిది జట్లు, రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్ ఏ: శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
గ్రూప్ బీ: బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్

ప్రతీ జట్టు తన గ్రూపులోని ప్రతి ఇతర జట్టుతో ఒకసారి తలపడనుంది. అల్ అమెరత్, షార్జా, అబుదాబిలో 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. తర్వాత ప్రతీ గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు తదుపరి రౌండ్ అంటే సూపర్ 12 కు చేరుకుంటాయి. అక్కడ వారు ఎనిమిది అగ్రశ్రేణి టీ 20 జట్లతో భాగం కానున్నారు. సూపర్ 12ఎస్‌ దశలో మరోసారి రెండు గ్రూపులుగా విభజించారు.

గ్రూప్ 1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, A1, B2
గ్రూప్ 2: ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్, B1, A2

ఈ స్టేజ్‌లో ప్రతీ టీం దాని గ్రూపులోని ప్రతి జట్టుతో ఒకసారి తలపడనుంది. ఈ రౌండ్‌ మ్యాచుు షార్జా, అబుదాబి, దుబాయ్‌లో జగరనున్నాయి. సూపర్ 12ఎస్‌లో మొత్తం 30 మ్యాచ్‌లు ఉన్నాయి. ప్రతీ గ్రూప్ నుంచి అగ్రస్థానంలో నిలిచిన మొదటి రెండు జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి.

పాయింట్ల ఎలా కేటాయిస్తారు. మ్యాచ్ టై అయితే ఏం చేయనున్నారు?
రెండు రౌండ్లలో ఒక జట్టు విజయం సాధిస్తే రెండు పాయింట్లు కేటాయిస్తారు. ఒకవేళ మ్యాచ్ టై అయితే ఒక పాయింట్ ఇవ్వనున్నారు. అలాగే ఫలితం తేలకుండా, రద్దు అయితే మాత్రం ఎలాంటి పాయింట్లు దక్కవు.

రెండు లేదా అంతకంటే ఎక్కువ జట్లు తమ గ్రూపులో సమాన పాయింట్లతో లీడింగ్‌లో ఉంటే ఈ క్రింది విధంగా తదుపరి రౌండ్‌లకు అర్హత సాధిస్తాయి.
– విజయాల సంఖ్య
– నెట్ రన్ రేట్
– హెడ్-టు-హెడ్ ఫలితం (ముందుగా పాయింట్లు, ఆ తర్వాత నెట్ రన్ రేట్)
– అసలు మొదటి రౌండ్/సూపర్ -12 సీడింగ్‌లు

డీఆర్‌ఎస్ అందుబాటులో ఉంటుందా?
అవును, మొదటిసారిగా పురుషుల టీ 20 ప్రపంచకప్ సమీక్షలకు డీఆర్‌ఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా మహమ్మారి తర్వాత మరలా క్రికెట్ మొదలయిన తరువాత టీ 20 ల్లో జరిగినట్లుగా ప్రతీ జట్టుకు ఒక ఇన్నింగ్స్‌కు గరిష్టంగా రెండు రివ్యూలు వాడుకునేందుకు అవకాశం ఉంది.

ఒక మ్యాచ్ టై అయితే ఏమవుతుంది?
మ్యాచ్ టై అయితే, ఇరు జట్లు సూపర్ ఓవర్ ఆడతాయి. ఒకవేళ సూపర్ ఓవర్ కూడా సమం అయితే, ఒక టీం గెలిచే వరకు ఇరు జట్లు సూపర్ ఓవర్లు ఆడుతూనే ఉంటాయి. వాతావరణ పరిస్థితులు లేదా సమయ పరిమితుల కారణంగా సూపర్ ఓవర్ సాధ్యం కాకపోతే, మ్యాచ్ టైగా ప్రకటిస్తారు. దీంతో ఒక్క జట్టుకు ఒక్కో పాయింట్ కేటాయిస్తారు.

ఒకవేళ సెమీ-ఫైనల్ సమయంలో ఫలితం తేలకపోతే, సూపర్ 12 గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఫైనల్‌లో ఇదే జరిగితే, రెండు జట్లు ఉమ్మడి విజేతలుగా ప్రకటించనున్నారు.

రిజర్వ్ డే ఉందా?
గ్రూప్-స్టేజ్ గేమ్‌లకు రిజర్వ్ డేలు లేవు. సెమీ ఫైనల్స్, ఫైనల్‌కు మాత్రమే రిజర్వ్ డేలు ఉన్నాయి. వాతావరణ పరిస్థితులతో మ్యాచ్ నిర్ణీత రోజులో పూర్తి కాకుంటే రిజర్వ్ డేన మ్యాచ్ తిరిగి నిర్వహించనున్నారు.

అయితే ఇందు కోసం కొన్ని రూల్స్‌ను ప్రకటించింది. ప్రతీ ఇన్నింగ్స్‌లో కనీసం ఐదు ఓవర్లు అయినా పడాలి. సెమీ ఫైనల్, ఫైనల్ కోసం అయితే కనీసం పది ఓవర్లు ఆడాల్సి ఉంటుంది.

టోర్నమెంట్ ఫేవరేట్‌లు ఎవరు?
టీంల ప్రస్తుత ఫాంటు చూస్తే.. ఇంగ్లండ్, డిఫెండింగ్ ఛాంపియన్ వెస్టిండీస్, భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ టీంలు ఫేవరేట్‌లుగా బరిలోకి దిగనున్నాయి.

విజేతకు ప్రైజ్ మనీ ఎంత?
టీ20 ప్రపంచ కప్‌లో ఛాంపియన్‌‌గా నిలిచిన టీం $ 1.6 మిలియన్ డాలర్లు(రూ 12.02 కోట్లు), రన్నరప్‌లకు $ 800,000 మిలియన్ డాలర్లు(రూ. 6 కోట్లు) దక్కనున్నాయి. అలాగే సెమీ ఫైనలిస్టులకు ఒక్కొక్క టీంకు $ 400,000 మిలియన్ డాలర్లు(రూ. 3 కోట్లు) లభిస్తాయి.

మ్యాచుల ప్రత్యక్ష ప్రసారాలను ఎలా చూడాలి?
అన్ని మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. తెలుగులో చూడాలనుకునే వారు మాత్రం స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానల్ చూడొచ్చు. అలాగే యాప్‌లో చూడాలనుకునే వారు డిస్నీ హాట్ స్టార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మ్యాచులను ప్రత్యక్షప్రసారం చూడొచ్చు.

మ్యాచుల టైమింగ్స్ ఏమిటి?
టీ20 ప్రపంచ కప్‌ మ్యాచులు భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటలకు, రాత్రి 7.30 గంటలకు మొదలుకానున్నాయి.

స్టేడియాల్లోకి ప్రేక్షకులకు అనుమతి ఉందా?
మ్యాచులు చేసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఉంది. అయితే తక్కువ సంఖ్యలో మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఒమన్‌లోని అల్ అమెరాట్ స్టేడియంలో 3000 మంది అభిమానులకు ఆతిథ్యమివ్వనున్నారు. ఒమన్ ప్రభుత్వం దేశంలోకి ప్రవేశించే వారందరికీ పూర్తిగా టీకాలు వేయడం తప్పనిసరి చేసింది. యూఏఈలో అన్ని వేదికలు గరిష్ట సామర్థ్యంలో దాదాపు 70 శాతం వద్ద పనిచేస్తాయి .

అబుదాబి స్టేడియానికి వెళ్లాలంటే మాత్రం రెండు డోసులు వేసుకోవాల్సిందే. అయితే దుబాయ్, షార్జాలో మాత్రం ఇలాంటి కండీషన్లు లేవు. అన్ని వేదికల వద్ద మాత్రం మాస్కులు ధరించాల్సి తప్పనిసరి.

Also Read: T20 World Cup: టీ 20 వరల్డ్ కప్‎కు ముందు పాకిస్తాన్‌‎కు షాక్.. జట్టు హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్ రాజీనామా..

T20 World Cup: క్రికెట్ గ్రౌండ్స్‌గా మారనున్న ఐనాక్స్ థియేటర్లు.. టీ 20 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి రెడీ