MI vs GT: రషీద్ శిష్యుడి దెబ్బకు స్కై ఔట్.. రూ. 30 లక్షల బౌలర్ ముందు తేలిపోయిన రూ.33.75 కోట్ల ప్లేయర్స్..

|

May 12, 2023 | 2:08 PM

Suryakumar Yadav vs Noor Ahmad, IPL 2023: వరుస మ్యాచ్‌లలో పరాజయం పాలైన ముంబై ఇండియన్స్.. గత కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సొంతం చేసుకుని, ప్లే ఆఫ్స్ రేసులోకి తిరిగి వచ్చింది. ఇందులో తుఫాన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌.. తన అద్బుతమైన బ్యాటింగ్‌తో దూసుకపోతూ.. కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నేడు గుజరాత్ టైటాన్స్ సవాలు విసిరేందుకు సిద్ధమయ్యాడు.

MI vs GT: రషీద్ శిష్యుడి దెబ్బకు స్కై ఔట్.. రూ. 30 లక్షల బౌలర్ ముందు తేలిపోయిన రూ.33.75 కోట్ల ప్లేయర్స్..
Surya Kumar Yadav
Follow us on

Suryakumar Yadav vs Noor Ahmad, IPL 2023: వరుస మ్యాచ్‌లలో పరాజయం పాలైన ముంబై ఇండియన్స్.. గత కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుత విజయాలు సొంతం చేసుకుని, ప్లే ఆఫ్స్ రేసులోకి తిరిగి వచ్చింది. ఇందులో తుఫాన్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్‌.. తన అద్బుతమైన బ్యాటింగ్‌తో దూసుకపోతూ.. కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ క్రమంలో నేడు గుజరాత్ టైటాన్స్ సవాలు విసిరేందుకు సిద్ధమయ్యాడు. అయితే, తొలిసారి ఈ రెండు జట్ల మధ్య జరిగిన పోరులో సూర్య విఫలమయ్యాడు. నేడు లీగ్‌లో ఈ రెండు జట్లు రెండో సారి ఢీకొట్టబోతున్నాయి. కానీ ఈసారి అతనికి విఫలమయ్యే అవకాశం లేదు. ఈసారి గుజరాత్‌పై అతని బ్యాట్ పనిచేయకపోతే ముంబై కష్టాల్లో పడుతుంది. ఇది మాత్రమే కాదు, ముంబై ప్లేఆఫ్ ఆశలు కూడా తగ్గిపోతాయి. ఇప్పటికే పాయింట్ల పట్టికలో గుజరాత్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో ముంబై ఇప్పుడు తన భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సి వస్తుంది.

ముంబైలో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కామెరాన్ గ్రీన్ వంటి బ్యాట్స్‌మెన్ ఉండగా, గుజరాత్‌లో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్ వంటి బౌలర్లు ఉన్నారు. షమీ, రషీద్‌లు తలో 19 వికెట్లు తీశారు. అయితే, 10 మ్యాచ్‌లలో 361 పరుగులు చేసిన సూర్య, ఈ ఇద్దరి కంటే రూ. 30 లక్షల బౌలర్ నుంచే ఎక్కువ ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది.

నూర్ అహ్మద్ నుంచి సూర్యకి ప్రమాదం..

రషీద్ ఖాన్ శిష్యుడు నూర్ అహ్మద్ సూర్యకు కష్టాలు సృష్టించేందుకు సిద్ధమయ్యాడు. గతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కూడా నూర్ అహ్మద్ ముందు సూర్య బ్యాట్ పనిచేయలేదు. ఈ సీజన్‌లో శుక్రవారం గుజరాత్‌, ముంబై జట్లు రెండోసారి తలపడుతున్నాయి. తొలి మ్యాచ్‌లో గుజరాత్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. సూర్య 23 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆఫ్ఘన్ బౌలర్ నూర్ తన బౌలింగ్‌లోనే రివర్స్ క్యాచ్ పట్టగా… అతని ముందు సూర్య చాలా కష్టపడుతున్నాడు. నూర్ బౌలింగ్‌లో సూర్య ఒక్క బౌండరీ మాత్రమే కొట్టగలిగాడు.

ఇవి కూడా చదవండి

నూర్ అహ్మద్ 7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. అతను అద్భుతాలు చేస్తూనే ఉన్నాడు. గత ఏడాది మెగా వేలంలో రూ. 30 లక్షల బేస్ ప్రైస్‌కు గుజరాత్ అతన్ని కొనుగోలు చేసింది. రూ. 30 లక్షల ఈ బౌలర్ రూ. 33.75 కోట్ల ముంబై బ్యాట్స్‌మెన్స్‌కు షాకిస్తున్నాడు. చివరి ఎన్‌కౌంటర్‌లో నూర్ 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. సూర్యకుమార్‌(రూ.8 కోట్లు)తోపాటు.. టిమ్ డేవిడ్‌(రూ.8.25 కోట్లు), కెమరూన్ గ్రీన్‌ (రూ.17.50 కోట్లు) వికెట్లను పడగొట్టాడు.