చెపాక్‌లో చెన్నైకి చెక్..!

ఐపీఎల్ 12 ఫైనల్‌కు ముంబై  సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్   బ్యాటింగ్ లో తడబడిన చెన్నై   ఐపీఎల్ 12వ సీజన్‌ మొదటి క్వాలిఫైయర్‌లో ముంబై విజయం సాధించి.. ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంబటి రాయుడు (42*; […]

చెపాక్‌లో చెన్నైకి చెక్..!
Follow us

|

Updated on: May 08, 2019 | 12:09 PM

  • ఐపీఎల్ 12 ఫైనల్‌కు ముంబై 
  • సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్  
  • బ్యాటింగ్ లో తడబడిన చెన్నై  

ఐపీఎల్ 12వ సీజన్‌ మొదటి క్వాలిఫైయర్‌లో ముంబై విజయం సాధించి.. ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. అంబటి రాయుడు (42*; 37 బంతుల్లో 3×4, 1×6)తో పాటు కెప్టెన్ ధోని (37*; 29 బంతుల్లో 0×4, 3×6) చివర్లో చెలరేగి భారీ సిక్సర్లు, బౌండరీలు బాదడంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ దక్కింది. ముంబై బౌలర్లలో రాహుల్ చాహర్ రెండు వికెట్లు తీయగా కృనాల్, జయంత్ చెరో వికెట్ పడగొట్టారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టుకు.. ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. ఓపెనర్ డికాక్ (8), కెప్టెన్ రోహిత్ శర్మ (4) తక్కువ స్కోర్‌కే పెవిలియన్‌ చేరారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (71; 54 బంతుల్లో 10×4, 0×6) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడికి తోడుగా ఇషాన్ కిషన్ (28; 31 బంతుల్లో 1×4, 1×6) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడడంతో ముంబై నిర్దేశించిన లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది.

.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..