IPL 2025: ఆ ప్లేయర్‌కి వేలంలో రూ.30 కోట్లు పక్కా.. సురేష్ రైనా సంచలన ప్రిడిక్షన్

|

Nov 21, 2024 | 1:43 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలం నవంబర్ 24, 25 తేదీలలో జరుగుతుంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరగనున్న ఈ వేలం ప్రక్రియలో మొత్తం 574 మంది ఆటగాళ్ల పేర్లు కనిపించనున్నాయి. ఈ జాబితాలోని మొదటి రౌండ్‌లో 6 మంది ఆటగాళ్లను వేలం వేయనున్నారు. ఈ జాబితాలో రిషబ్ పంత్ పేరు కూడా కనిపిస్తుంది.

1 / 5
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) సీజన్-18 మెగా వేలంలో రిషబ్ పంత్ రికార్డు మొత్తానికి వేలం వేయబడుతుందని టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనా జోస్యం చెప్పాడు. రూ.2 కోట్లు అసలు ధరతో కనిపించిన పంత్ 25 నుంచి 30 కోట్లు పలికే అవకాశం ఉందని చెప్పాడు.

2 / 5
రిషబ్ పంత్ నాయకత్వ అనుభవం, బ్యాటింగ్ నైపుణ్యం బ్రాండ్ విలువను పరిగణనలోకి తీసుకుంటే, అతని కొనుగోలు కోసం బిడ్డింగ్ వార్ జరగడం ఖాయమని సురేశ్ రైనా అభిప్రాయం వ్యక్తం చేశాడు. వేలంలో రూ.25 కోట్లు మించి ధర పలుకుందని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.

3 / 5
"రిషబ్‌ పంత్‌కి 25 నుంచి 30 కోట్లు వస్తే తప్పక పొందాలి.. ఎందుకంటే ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారీ మొత్తంలో పారితోషికం ఇస్తారు. ప్రస్తుతం అన్ని విభాగాల్లో రాణిస్తున్న పంత్‌కు కూడా పెద్ద మొత్తం దక్కనుంది. 30 కోట్లకు రిషబ్ పంత్ వేలం వేయాలని ఫాంఛైజీలు భావిస్తున్నాయి" అని సురేష్ రైనా పేర్కొన్నాడు.

4 / 5
రిషబ్ పంత్ బేస్ రూ.2 కోట్లు.. అందువల్ల, మొదటి రౌండ్‌లో పంత్ కొనుగోలు కోసం అన్ని ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడతాయి. ఈ పోటీ కారణంగా రిషబ్ పంత్ రూ.25 నుంచి 30 కోట్లు పలుకుతాడని ఫ్యాన్స్ కూడా అభిప్రాయపడుతున్నారు.

5 / 5
గత సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ నుంచి రిషబ్ పంత్ రూ.16 కోట్లు అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, RCB, కోల్‌కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీలు మెగా వేలంలో పంత్‌ను కొనుగోలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. నవంబర్ 24న జరగనున్న మెగా వేలం జరుగునున్న సంగతి తెలిసిందే.