RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన బెంగుళూరు.. సునాయసనంగా గెలిచిన హైదరాబాద్..

| Edited By: Basha Shek

Apr 24, 2022 | 4:01 AM

RCB vs SRH: ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు హైదరాబాద్‌ వర్సెస్ రాయల్‌ ఛాలెంజర్‌ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ సునాయసనంగా

RCB vs SRH: 68 పరుగులకే కుప్పకూలిన బెంగుళూరు.. సునాయసనంగా గెలిచిన హైదరాబాద్..
SRH
Follow us on

RCB vs SRH: ఐపీఎల్‌లో భాగంగా ఈ రోజు హైదరాబాద్‌ వర్సెస్ రాయల్‌ ఛాలెంజర్‌ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ సునాయసనంగా విజయం సాధించింది. 12 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేధించింది. బెంగుళూరు కేవలం 16.1 ఓవరల్లో 68 పరుగలకే కుప్పకూలింది. దీంతో 69 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్‌ ఒక వికెట్‌ కోల్పోయి విజయం సాధించింది. ఓపెనర్‌ అభిషేక్ శర్మ 28 బంతుల్లో 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 47 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్‌ విలియమ్‌సన్ 16 పరుగులు చేశాడు. బెంగుళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ కి  ఒక వికెట్‌ దక్కింది. ఈ విజయంతో హైదరాబాద్‌ (10) పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కి దిగిన బెంగుళూరు 16.1 ఓవర్లలో 68 పరుగులకే కుప్పకూలింది. ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ నుంచే బెంగళూరు వికెట్ల పతనం ప్రారంభమైంది. హైదరాబాద్‌ బౌలర్ మార్కో మాన్‌సెన్‌ (3/25) ఒకే ఓవర్‌లో మూడు వికెట్లు తీసి బెంగళూరు కుప్పకూలడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత నటరాజన్‌ (3/10) విజృంభించాడు. వీరితోపాటు సుచిత్ (2/12), ఉమ్రాన్ మాలిక్ (1/13), భువనేశ్వర్ (1/8) చెలరేగడంతో బెంగళూరు కోలుకోలేకపోయింది. బెంగళూరు బ్యాటర్లలో కోహ్లీ, అనుజ్‌ రావత్, దినేశ్ కార్తిక్ డకౌట్‌ కాగా.. గ్లెన్‌ మ్యాక్స్‌వెల్ 12, ప్రభుదేశాయ్‌ 15, హసరంగ 8, షాహ్‌బాజ్ 7, డుప్లెసిస్‌ 5, హర్షల్‌ పటేల్ 4, హేజిల్‌వుడ్ 3*, సిరాజ్‌ 2 పరుగులు చేశారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

NEP 2020: ఆ రాష్ట్రంలో ఇక ఎంఫిల్‌ చదువులకి స్వస్తి.. బీఈడీ కోర్సు నాలుగు సంవత్సరాలు..!

CRIS Recruitment 2022: నిరుద్యోగులకి శుభవార్త.. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌ నుంచి నోటిఫికేషన్..

Blood Donations: రెగ్యూలర్‌గా రక్తదానం చేస్తే మంచిదే.. ఈ విషయాలు తెలిస్తే మీరూ నిజమే అంటారు..!