IPL 2021, SRH vs PBKS: ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో 37వ మ్యాచులో భాగంగా పంబాజ్ కింగ్స్, సన్ రైజర్స్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పంజాబ్ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి క్షణం వరకు నువ్వా, నేనా అన్నట్లు సాగిన మ్యాచ్ లో పంజాబ్ విజయాన్ని సొంతం చేసుకుంది. పంజాబ్ ఇచ్చిన 125 పరగులు స్వల్ప లక్ష్యాన్ని కూడా సన్ రైజర్స్ చేధించలేక పోయింది. దీంతో పంజాబ్ 5 పరుగుల తేడాతో గెలుపొందింది.
ఇప్పటి వరకు ఈ రెండు టీంలు 17 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచుల్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ కేవలం 5 మ్యాచుల్లో గెలుపొందింది. ఈ ఏడాది ప్రారంభంలో చెపాక్‌లో హైదరాబాద్ జట్టు రాహుల్ నేతృత్వంలోని జట్టును కేవలం 120 పరుగులకే పరిమితం చేసింది.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (కీపర్, కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
పంజాబ్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని కూడా చేధించడంలో సన్‌రైజర్స్ ఇబ్బంది పడుతోంది. వరుస వికెట్లు పడుతుండడంతో హైదరాబాద్ కష్టాల్లోకి కూరుకుపోయింది. 16వ ఓవర్‌లో సాహా రన్ అవుట్‌గా నిలిచాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 6 వికెట్ల నష్టానికి 103 పరుగుల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్ గెలవాలంటే ఇంకా 13 బంతుల్లో 22 పరుగుల చేయాల్సి ఉంది.
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు కోల్పోయి హైదరాబాద్ జట్టు కష్టాల్లోకి కూరుకుపోయింది. 12వ ఓవర్‌లో రెండో బంతికి జాదవ్ వెనుదిరగగా, అనంతరం క్రీజులోకి వచ్చిన సమద్ కేవలం 1 పరుగు మాత్రమే చేసి క్రిస్ గేల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుతిరిగాడు.
కేదర్ జాదవ్, సాహా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే పనిలో పడుతున్నారని అనుకుంటున్న సమయంలోనే హైదరాబాద్‌కు ఎదురు దెబ్బ తగిలింది. 12.2 ఓవర్‌లో రవి బిష్ణోయ్ విసిరిన బంతికి జాదవ్ క్లీన్ బోల్డ్‌గా వెనుదిరిగాడు. తర్వాత క్రీజులోకి అబ్దుల్ సమద్ వచ్చాడు.
ఆరంభంలో కాస్త తడబడిన నెమ్మదిగా హైదరాబాద్ జట్టు స్కోరు పెరుగుతోంది. పంజాబ్ ఇచ్చిన 125 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు సన్‌రైజర్స్ కాస్త కష్టపడుతుందని చెప్పాలి. 12 ఓవర్లకు 3 మూడు వికెట్లు కోల్పోయిన సన్‌రైజర్స్ 56 పరుగులతో కొనసాగుతోంది. ప్రస్తుతం క్రీజులో కేదర్ జాదవ్ (12), వృద్ధిమాన్ సాహా (25) పరుగులతో ఉన్నారు.
పంజాబ్ ఇచ్చిన స్వల్ప లక్ష్యాన్ని చేధించే క్రమంలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ ఆశించిన స్థాయిలో ఇన్నింగ్స్ ఆడట్లేదని చెప్పాలి. పది ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి కేవలం 43 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రస్తుతం క్రీజులో సాహా (20), కేదర్ జాదవ్ (5 ) ఉన్నారు. హైదరాబాద్ గెలవడానికి ఇంకా 60 బంతుల్లో 83 పరుగులు చేయాల్సి ఉంది.
5 ఓవర్లకు హైదరాబాద్ టీం రెండు వికెట్లు కోల్పోయి 15 పరుగులు సాధించింది. క్రీజులో మనీష్ పాండే 4, సాహా 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
కేన్ విలియమ్సన్ (1) రూపంలో హైదరాబాద్ టీం 10 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 2.2 ఓవర్లో షమీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు.
డేవిడ్ వార్నర్ (2) రూపంలో హైదరాబాద్ టీం 2 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. 0.3 ఓవర్లో షమీ బౌలింగ్‌లో కీపర్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ టీం బ్యాట్స్‌మెన్స్‌ను హైదరాబాద్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఏ దశలోనూ భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. దీంతో పంజాబ్ టీం నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది.
18 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ టీం ఆరు వికెట్లు కోల్పోయి 104 పరుగులు సాధించింది. క్రీజులో నాథన్ ఎల్లీస్ 4, బ్రార్ 8 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
దీపక్ హుడా (13) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం 96 పరుగుల వద్ద ఆరో వికెట్‌ను కోల్పోయింది. 15.4 ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో సుచిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
మక్రాం (27 పరుగులు, 32 బంతులు, 2 ఫోర్లు) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం 88 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది. 14.4 ఓవర్లో అబ్దుల్ బౌలింగ్‌లో మనీష్ పాండేకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
పూరన్ (8) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం 66 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 11.4 ఓవర్లో సందీప్ శర్మ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
క్రిస్ గేల్ (14) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం 57 పరుగుల వద్ద మూడో వికెట్‌ను కోల్పోయింది. 10.4 ఓవర్లో రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీగా పెవిలియన్ చేరాడు.
10 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ టీం రెండు వికెట్లు కోల్పోయి 55 పరుగులు సాధించింది. క్రీజులో మక్రాం 14, క్రిస్ గేల్ 13 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
8 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ టీం రెండు వికెట్లు కోల్పోయి 39 పరుగులు సాధించింది. క్రీజులో మక్రాం 7, క్రిస్ గేల్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
మయాంక్ అగర్వాల్ (5) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం 27 పరుగుల వద్ద రెండో వికెట్‌ను కోల్పోయింది. 4.5 ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో విలియమన్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
కేఎల్ రాహుల్ (21) రూపంలో పంజాబ్ కింగ్స్ టీం 26 పరుగుల వద్ద తొలి వికెట్‌ను కోల్పోయింది. 4.1 ఓవర్లో హోల్డర్ బౌలింగ్‌లో సుచిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
4 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ టీం వికెట్ నష‌్టపోకుండా 26 పరుగులు సాధించింది. క్రీజులో కేఎల్ రాహుల్ 21, మయాంక్ 5 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
2 ఓవర్లకు పంజాబ్ కింగ్స్ టీం వికెట్ నష‌్టపోకుండా 13 పరుగులు సాధించింది. క్రీజులో కేఎల్ రాహుల్ 9, మయాంక్ 4 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ కింగ్స్ టీం తన ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ బరిలోకి దిగారు.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్ (కీపర్, కెప్టెన్), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, రవి బిష్ణోయ్, మహమ్మద్ షమీ, హర్‌ప్రీత్ బ్రార్, అర్షదీప్ సింగ్, నాథన్ ఎల్లిస్
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ప్లేయింగ్ XI): డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా (కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మనీష్ పాండే, కేదార్ జాదవ్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, సందీప్ శర్మ, ఖలీల్ అహ్మద్
ఐపీఎల్ 2021 ఎడిషన్‌లో 37వ మ్యాచులో భాగంగా నేడు పంజాబ్ కింగ్స్ (PBKS)తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనుంది. పాయింట్ల పట్టికలో చివరి రెండు స్థానాల్లో ఉన్న టీంల మధ్య పోరు జరగనుంది. మరికొద్ది సేపట్లో టాస్ పడనుంది.