IPL 2026: హైదరాబాద్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్‌ 2026 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?

IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్-19 మార్చి 26 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, అంతకుముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆస్ట్రేలియన్ ఆల్ రౌండర్ ఈ టోర్నమెంట్ నుంచి తప్పుకునే అవకాశం ఎక్కువగా ఉందనే వార్తలతో ఫ్రాంచైజీ కూడా ఇబ్బందుల్లో పడింది. ఆయనెవరో ఓసారి చూద్దాం..

IPL 2026: హైదరాబాద్ ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్.. ఐపీఎల్‌ 2026 నుంచి స్టార్ ప్లేయర్ ఔట్..?
SRH IPL 2026

Updated on: Feb 04, 2026 | 1:35 PM

ప్రస్తుతం అన్ని జట్లు ఐసీసీ మెగా ఈవెంట్ టీ20 ప్రపంచకప్ 2026 కోసం సిద్ధమవుతున్నాయి. దాదాపు నెల రోజులపాటు జరిగే ఈ టోర్నమెంట్ కోసం ఫ్యాన్స్ తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ చూపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై నిలవనుంది. టీ20 ప్రపంచకప్ లోనూ తమ ఐపీఎల్ స్టార్ ప్లేయర్ల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ వస్తోంది. టీ20 ప్రపంచ కప్ ముగిసిన వెంటనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2026) ప్రారంభమవుతుంది. మార్చి 26న ప్రారంభమయ్యే ఈ టోర్నమెంట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కనిపించే అవకాశం లేదని తెలుస్తోంది. వెన్నునొప్పి సమస్యతో బాధపడుతున్న పాట్ కమ్మిన్స్ రాబోయే టీ20 ప్రపంచ కప్ నకు దూరమైన సంగతి తెలిసిందే. అంతేకాకుండా తాను పూర్తిగా ఫిట్ గా ఉంటేనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడతానని చెప్పి, హైదరాబాద్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ ఆడటం గురించి సమాచారాన్ని పంచుకున్న పాట్ కమ్మిన్స్, “ప్రస్తుతానికి నేను ఏం చెప్పలేను. నేను మరో స్కాన్ చేయించుకోవాలి. ఆ తర్వాత చికిత్స కొనసాగుతుంది. కాబట్టి నేను ఐపీఎల్‌లో పాల్గొంటానా లేదా అనేది నా వెన్నెముక కోలుకోవడంపై ఆధారపడి ఉంటుంది” అంటూ చెప్పుకొచ్చాడు.

అయితే, మార్చి నెలాఖరు నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తానని పాట్ కమ్మిన్స్ నమ్మకంగా ఉన్నాడు. దీని ప్రకారం, ఐపీఎల్ ప్రారంభానికి ముందు కమ్మిన్స్ పూర్తిగా కోలుకుంటేనే క్రికెట్ ఆస్ట్రేలియా అతన్ని ఐపీఎల్‌లో ఆడటానికి అనుమతిస్తుంది. అందువల్ల, ఐపీఎల్ ఆడటంలో ఖచ్చితంగా ఉండటానికి పాట్ కమ్మిన్స్ వచ్చే నెల వరకు వేచి ఉండాల్సి ఉంటుంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: పాట్ కమిన్స్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, స్మ్రాన్ రవిచంద్రన్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, కమిందు మెండిస్, హర్షల్ పటేల్, బ్రైడన్ కార్సే, జైదేవ్ ఉనద్కత్, సల్షన్ ఉనద్కత్, సల్షాన్ ఉనద్కత్, ఎషన్రా కుమార్, షకీబ్ హుస్సేన్, అమిత్ కుమార్, క్రేన్స్ ఫుల్లెర్ట్రా, ప్రఫుల్ హింగే, శివమ్ మావి, లియామ్ లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, క్రేన్స్ ఫుల్లెర్ట్రా.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి