Sunil Narine : తండ్రైన ఆనందంలో మరో స్టార్‌ క్రికెటర్‌.. వెస్టిండీస్​ స్నిన్నర్​ సునిల్​ నరైన్

|

Feb 03, 2021 | 12:40 AM

వెస్టిండీస్​ స్నిన్నర్​ సునిల్​ నరైన్​ తండ్రయ్యాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. తన ముద్దుల కుమారుడి ఫొటోను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు...

Sunil Narine : తండ్రైన ఆనందంలో మరో స్టార్‌ క్రికెటర్‌.. వెస్టిండీస్​ స్నిన్నర్​ సునిల్​ నరైన్
Follow us on

Sunil Narine : వెస్టిండీస్​ స్నిన్నర్​ సునిల్​ నరైన్​ తండ్రయ్యాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నాడు. తన ముద్దుల కుమారుడి ఫొటోను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. అంతే కాదు.. ఆ చిన్నోడిని ఉద్దేశిస్తూ ఓ కామెంట్ కూడా జోడించాడు. “మాకు తెలియని అనుభూతిని అందించావు. దేవుడి మంచితనం, దయ ఈ చిన్ని ముఖంలో కనిపిస్తోంది. నిన్ను అమితంగా ప్రేమిస్తాం – ఇట్లు.. అమ్మానాన్న” అని రాసుకొచ్చాడు.

విండీస్‌ క్రికెటర్‌ అయినప్పటికీ భారత్‌లోనూ నరైన్‌కు ఫ్యాన్స్ ఉన్నారు. ఐపీఎల్‌లో అతడు కోల్‌కతా నైట్ రైడర్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తన స్పిన్‌తో పాటు ఓపెనర్‌గా బౌండరీలు బాదుతూ నరైన్ కోల్‌కతా నైట్ రైడర్స్‌ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే అతడు ప్రస్తుతం యూఏఈ వేదికగా జరుగుతున్న టీ10 లీగ్‌లో డెక్కన్ గ్లాడియేటర్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ మధ్యే..టీమిండియా సారథి విరాట్ కోహ్లీ, కేన్‌ విలియమ్సన్‌ కూడా తండ్రయ్యారు.

ఇవి కూడా చదవండి : 

ICC Player of The Month : ఐసీసీ కొత్త అవార్డులు.. నామినీల్లో టీమిండియా ఆటగాడు వికెట్ కీపర్ రిషబ్ పంత్‌

Doomsday Clock : ప్రళయం ముంచుకొస్తోందా…? ప్రపంచం అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉందా..? డూమ్స్ డే ఏం చెబుతోంది..!