IPL 2021: మహి ఇంకా ఆకలితోనే ఉన్నాడు.. ధోనీపై ప్రశంశల జల్లు కురిపించిన చెన్నై కోచ్

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఆరు వికెట్ల...

IPL 2021: మహి ఇంకా ఆకలితోనే ఉన్నాడు.. ధోనీపై ప్రశంశల జల్లు కురిపించిన చెన్నై కోచ్
Stephen Fleming And Dhoni

Updated on: Apr 17, 2021 | 5:56 PM

ఐపీఎల్‌లో భాగంగా శుక్రవారం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచులో ఆరు వికెట్ల తేడాతో చెన్నై ఘన విజయం సాధించి, పాయింట్ల పట్టికలో తమ ఖాతా తెరిచింది. అయితే ఈ మ్యాచ్‌తో ధోని, సీఎస్‌కే తరుపున 200మ్యాచులు ఆడిన ఏకైక క్రికెటర్‌గా నిలిచాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభం నుండి చెన్నైకు ప్రాతినిధ్యం వహిస్తున్న ధోని, ఆ జట్టుకు మూడు సార్లు కప్ అందించాడు. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని, ఇప్పటికీ క్రికెట్ అభిమానులను, చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను అలరిస్తున్నాడు.

అయితే ఈ మ్యాచ్ పూర్తయిన తరువాత ఆ జట్టు కోచ్ మాట్లాడుతూ.. ధోని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ‘ధోని 200 మ్యాచులు ఆడినా, అతను ఇంకా ఆకలితోనే ఉన్నాడు, ఇదే తనకు ఆట మీద ఉన్న అంకితభావానికి నిదర్శనం. 200 మ్యాచులు ఆడి, ఎన్ని విజయాలు ఇచ్చినా, ఆయన జట్టుకు ఇంకా చేయాలి, ఇంకా కష్టపడాలి అని పరితపిస్తుంటాడు’ అని కొనియాడాడు.

అటు ఈ టోర్నీలో చెన్నై ఇంగ్లాండ్ ఆటగాడు మొయిన్ అలీని రూ.7 ఏడు కోట్లకు కొనుగోలు చేసింది. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని అతని గురించి మాట్లాడాడు. ‘మొయిన్ ఓ మంచి పరిణీతి చెందిన ఆటగాడు, అతని బ్యాటింగ్ ఆర్డర్‌ను మారిస్తే మంచి ఫలితాలు వస్తాయని అతడిని నంబర్ 03లో పంపించాము, మేము మా వనరులను సరిగ్గా వినియోగించుకుంటున్నాం, అతని ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉంది’ అని పేర్కొన్నాడు.

Read More: MI vs SRH IPL 2021: జోరు మీదున్న ముంబై.. ఈ మ్యాచులోనైనా హైదరాబాద్ ఖాతా తెరిచేనా?

Jasprit Bumrah: సోషల్ మీడియాలో బుమ్రాపై సంజన ఇంట్రస్టింగ్ కామెంట్స్… ( వీడియో )