ఆర్సీబీ vs పంజాబ్‌.. ఎవరు గెలిచినా హార్ట్‌బ్రేక్‌ అవుతుంది! రాజమౌళి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

ఐపీఎల్ 2025 ఫైనల్‌లో RCB, పంజాబ్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. రాజమౌళి ఫైనల్‌పై స్పందించి, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీల ప్రతిభను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. రెండు జట్లలో ఒకటి తొలిసారిగా ట్రోఫీని గెలుచుకోబోతోంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జూన్ 3న జరుగుతుంది.

ఆర్సీబీ vs పంజాబ్‌..   ఎవరు గెలిచినా హార్ట్‌బ్రేక్‌ అవుతుంది! రాజమౌళి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
Pbks Vs Rcb And Rajamouli

Updated on: Jun 02, 2025 | 3:47 PM

ఐపీఎల్‌ 2025 ఫైనల్‌లో ఆర్సీబీ, పంజాబ్‌ జట్లు తలపడనున్నాయి. జూన్‌ 3న(మంగళవారం) ఈ మెగా ఫైనల్‌ అహ్మాదాబాద్‌ వేదికగా జరగనుంది. గత 17 సీజన్లలో ఈ రెండు జట్లకు కూడా ట్రోఫీ లేదనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కచ్చితంగా ఈ రెండు టీమ్స్‌లో ఒకరికి కప్పు అయితే దక్కనుంది. ఐపీఎల్‌ చరిత్రలోనే మరో కొత్త ఛాంపియన్‌ టీమ్‌ ఆవిర్భవించబోతోంది. తొలి కప్పు కైవసం చేసుకోబోతున్న ఆ టీమ్‌ ఏదో అని యావత్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ రాజమౌళి సైతం ఐపీఎల్‌ ఫైనల్‌పై స్పందించారు. పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య జరిగిన క్వాలిఫైయర్‌ 2లో శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ను ప్రసంశిస్తూ రాజమౌళి ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. బుమ్రా, బౌల్ట్‌ వేసిన యార్కర్లలో అయ్యర్‌ ఎదుర్కొన్న తీరు, వాటిని బౌండరీకి తరలించిన తీరు అద్భుతమంటూ రాజమౌళి అయ్యర్‌ను మెచ్చుకున్నారు. అయ్యర్‌.. ఢిల్లీని ఫైనల్‌కు తీసుకెళ్లాడు, కేకేఆర్‌తో కప్పు కొట్టించాడు, ఇప్పుడు పంజాబ్‌ కింగ్స్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు. ఐపీఎల్‌ ట్రోఫీ గెలిచేందుకు అతను అర్హుడని రాజమౌళి అన్నారు.

అలాగే మరోవైపు విరాట్‌ కోహ్లీ సైతం ఏళ్లుగా అద్భుతంగా ఆడుతూ.. కప్పు కోసం పోరాటం చేస్తున్నాడని కోహ్లీ కూడా కప్పు సొంత చేసుకునేందుకు అర్హుడని రాజమౌళి తెలిపారు. ఫైనల్‌ మ్యాచ్‌లో ఇద్దరిలో ఎవరు గెలిచినా.. హార్ట్‌బ్రేక్‌ మాత్రం తప్పదంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్‌ వైరల్‌గా మారింది. సాధారణ క్రికెట్‌ అభిమానిలానే రాజమౌళి కూడా ఐపీఎల్‌ను క్లోజ్‌గా ఫాలో అవుతున్నట్లు ఆయన ట్వీట్‌ని బట్టి అర్థం అవుతుందంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..