AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH vs PBKS Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. తెలుగబ్బాయ్ రీఎంట్రీ.. ప్లేయింగ్ 11 ఇదే..!

IPL Sunrisers Hyderabad vs Punjab Kings Playing XI: ఐపీఎల్‌లో ఈ రెండు జట్లు 25 సార్లు తలపడ్డాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే పైచేయిగా నిలిచింది. ఎస్ఆర్‌హెచ్ 17 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ 8 మ్యాచ్‌లు గెలిచింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య ఇది ​​రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో పంజాబ్ తమ సొంత మైదానంలో హైదరాబాద్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. గత సీజన్‌లో కూడా ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది.

SRH vs PBKS Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. తెలుగబ్బాయ్ రీఎంట్రీ.. ప్లేయింగ్ 11 ఇదే..!
Srh Vs Pbks Toss Update
Venkata Chari
|

Updated on: May 06, 2026 | 7:09 PM

Share

IPL Sunrisers Hyderabad vs Punjab Kings Playing XI: ఐపీఎల్ 2026లో భాగంగా మే 6వ తేదీన జరిగే 49వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ టీం ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో హైదరాబాద్ టీం తొలుత బ్యాటింగ్ చేయనుంది.

వరుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి అజేయంగా దూసుకుపోతున్న పంజాబ్, గత రెండు మ్యాచ్‌లలో ఓడిపోవడంతో ఇప్పుడు ఒత్తిడిలో ఉంది. మరోవైపు, పాట్ కమిన్స్ సారథ్యంలోని హైదరాబాద్ జట్టు, సొంతగడ్డపై పంజాబ్ బలహీనతలను సద్వినియోగం చేసుకొని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని చూస్తోంది.

పిచ్ నివేదిక..

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన 88 ఐపీఎల్ మ్యాచ్‌లలో, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 38 గెలవగా, ఛేజింగ్ చేసిన జట్లు 49 గెలిచాయి. ఇక్కడ అత్యధిక జట్టు స్కోరు 286/6. గత సంవత్సరం రాజస్థాన్ రాయల్స్‌పై హైదరాబాద్ జట్టు నమోదు చేసింది.

తేలికపాటి వర్షం కురిసే అవకాశం..

బుధవారం హైదరాబాద్‌లో తేలికపాటి వర్షం, మృదువైన గాలులతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత 36 నుంచి 37 డిగ్రీల సెల్సియస్ మధ్య, కనిష్ట ఉష్ణోగ్రత సుమారు 23 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ XI: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్(కెప్టెన్), శివంగ్ కుమార్, ఈషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్.

పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ XI: ప్రభ్‌సిమ్రాన్ సింగ్(కీపర్), కూపర్ కొన్నోలీ, శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), శశాంక్ సింగ్, సూర్యాంశ్ షెడ్జ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us