SRH IPL 2023 Auction: ఈసారైనా SRH రాత మారుతుందా? టెస్టు స్పెషలిస్ట్‌పై హైదరాబాద్ కన్ను.. వీళ్లూ ఉండాల్సిందే!

|

Dec 22, 2022 | 5:59 PM

Sunrisers Hyderabad IPL 2023 Auction: మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2023 మినీ వేలం జరగనుంది. కొచ్చి వేదికగా ఈ ఆక్షన్ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది.

SRH IPL 2023 Auction: ఈసారైనా SRH రాత మారుతుందా? టెస్టు స్పెషలిస్ట్‌పై హైదరాబాద్ కన్ను.. వీళ్లూ ఉండాల్సిందే!
Sunrisers Hyderabad
Follow us on

మరికొద్ది గంటల్లో ఐపీఎల్ 2023 మినీ వేలం జరగనుంది. కొచ్చి వేదికగా ఈ ఆక్షన్ శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని ఫ్రాంచైజీలు తమకు ట్రోఫీని అందించగలిగే ప్లేయర్స్‌ను వేలంలో ఒడిసి పట్టుకోవాలని తహతహలాడుతున్నారు. అటు ప్రేక్షకులు కూడా ఏ ప్లేయర్.. ఏ టీం దక్కించుకుంటుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇదిలా ఉంటే.. మినీ వేలానికి ముందుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పలు కీలక ప్లేయర్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక అందులో ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఉన్నాడు. దీంతో ప్రస్తుతం హైదరాబాద్ టీంని ముందు ఉండి నడిపించే నాయకుడు కావాలి. అలాగే ఇదొక్కటే ఆ ఫ్రాంచైజీ ఇష్యూ కాదు.. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, ఆల్‌రౌండర్, స్పిన్నర్ కూడా ప్రధాన సమస్యలే. ఇక ఇవన్నీ తీరాలంటే.. డ్యుయల్ రోల్స్ ప్లే చేయగలిగే ప్లేయర్స్‌పై సన్‌రైజర్స్ ప్రత్యేక దృష్టి పెట్టాలి. అలాగే ఈ ఫ్రాంచైజీ.. టెస్ట్ స్పెషలిస్ట్ బెన్ స్టోక్స్ మీద ఫోకస్ పెట్టింది. అటు కెప్టెన్‌గా, ఇటు ఆల్‌రౌండర్‌గా జట్టును విజయతీరాలకు చేర్చడమే కాదు.. నెక్స్ట్ సీజన్‌లో ట్రోఫీ అందించగలడని భావిస్తోంది.

సన్‌రైజర్స్ రిటైన్ ఆటగాళ్ల బ్రేక్ డౌన్ ఇలా..

  • టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు – రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్కరమ్

  • ఫినిషర్లు – గ్లెన్ ఫిలిప్స్, ఆబ్దుల్ సమద్

  • ఆల్‌రౌండర్లు – వాషింగ్టన్ సుందర్

  • ఫాస్ట్ బౌలర్లు – మార్కో జాన్సెన్, నటరాజన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్, ఫారూఖి, కార్తీక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్

  • *మిగిలిన మొత్తం*: రూ. 42.25 కోట్లు, *ఓవర్సీస్ స్లాట్స్*: 4, *మొత్తం స్లాట్స్*: 13

  • *రిలీజ్ ప్లేయర్స్*: విలియమ్సన్, పూరన్, సుచిత్, ప్రియమ్ గార్గ్, సామ్రాత్, షెఫర్డ్, సౌరభ్ దూబే, అబోత్, శశాంక్ సింగ్, శ్రేయాస్ గోపాల్, సుశాంత్ మిశ్రా, విష్ణు వినోద్

ప్రధాన సమస్యలు:

– కేన్ విలియమ్సన్‌ను విడుదల చేయడంతో హైదరాబాద్ జట్టుకు టాప్ ఆర్డర్‌లో అనుభవం ఉన్న బ్యాట్స్‌మెన్లు ఎవ్వరూ లేరు. 2016-20 మధ్య సీజన్లలో SRHకు టాప్‌లో వార్నర్, విలియమ్సన్ జట్టుకు ఎన్నో విజయాలు అందించడంలో కీలక పాత్ర పోషించారు.

– ఈ ఏడాది ఐపీఎల్‌లో హైదరాబాద్ జట్టు స్పిన్నర్లు బౌలింగ్ చేసిన కేవలం 60 ఓవర్లు మాత్రమే. మిగతా టీమ్స్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. దీన్ని బట్టే SRHకి స్పిన్నర్ చాలా అవసరం అని చెప్పొచ్చు.

– పూరన్, షెఫర్డ్ లాంటి ఫినిషర్లను రిలీజ్ చేయడంతో ఇప్పుడు SRH వారిని భర్తీ చేయగలిగే ఆప్షన్స్ ఏంటా అని ఆలోచిస్తోంది. సుందర్, ఫిలిప్స్‌తో పాటు బెన్ స్టోక్స్, కామెరాన్ గ్రీన్ జట్టులోకి వస్తే బాగా ప్లస్ అవుతుంది. అలాగే రెగ్యులర్ వికెట్ కీపర్‌ పై కూడా హైదరాబాద్ జట్టు ఫోకస్ పెట్టింది.

టార్గెట్ ప్లేయర్స్: బెన్ స్టోక్స్, జోష్ ఫిలిప్, ఫిల్ సాల్ట్, ఎన్ జగదీషన్, సికందర్ రాజా, ట్రావిస్ హెడ్, జో రూట్, రిలీ రోసోవ్, కామెరాన్ గ్రీన్, షకీబ్ అల్ హసన్, ఆదిల్ రషీద్, ఆడమ్ జంపా, మురుగన్ అశ్విన్