AUS vs SA, WTC Final 2025: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కరువు తీర్చే ప్లేయింగ్ 11 ఇదే..

AUS vs SA, WTC Final 2025 Toss Update: ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్లు రెండూ ఫైనల్‌కు కేవలం ఒక రోజు ముందు తమ ప్లేయింగ్ XIని ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. కెప్టెన్ టెంబా బావుమా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

AUS vs SA, WTC Final 2025: టాస్ గెలిచిన సౌతాఫ్రికా.. 27 ఏళ్ల కరువు తీర్చే ప్లేయింగ్ 11 ఇదే..
Wtc Final 2025 Aus Vs Sa

Updated on: Jun 11, 2025 | 2:54 PM

AUS vs SA, WTC Final 2025 Toss Update: చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో టెస్ట్ ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచేందుకు ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా తలపడుతున్నాయి. దక్షిణాఫ్రికా టాస్ గెలిచింది. కెప్టెన్ టెంబా బావుమా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు.

ఫైనల్‌కు ఒక రోజు ముందు రెండు జట్లు తమ ప్లేయింగ్ ఎలెవన్ జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఫైనల్ కోసం తన బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంది. మార్నస్ లాబుస్చాగ్నే ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఓపెనింగ్ చేయనున్నాడు. దక్షిణాఫ్రికా మూడవ ఫాస్ట్ బౌలర్ గా డాన్ పీటర్సన్ కంటే లుంగీ ఎన్గిడికి ప్రాధాన్యత ఇచ్చింది. గత ఏడాది ఆగస్టు నుంచి ఎన్గిడి ఏ టెస్ట్ ఆడలేదు.

ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమ్మిన్స్ (కెప్టెన్), ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లాబుస్చాగ్నే, కామెరాన్ గ్రీన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, బ్యూ వెబ్‌స్టర్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), మిచెల్ స్టార్క్, నాథన్ లియాన్, జోష్ హాజిల్‌వుడ్.

దక్షిణాఫ్రికా ప్లేయింగ్ XI: టెంబా బావుమా (కెప్టెన్), ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ బెడింగ్‌హామ్, కైల్ వెరిన్ (వికెట్ కీపర్), మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, కగిసో రబాడ, లుంగి న్గిడి.

హెడ్ ​​టు హెడ్ రికార్డ్..

ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు మొత్తం 101 టెస్ట్ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఆస్ట్రేలియా 54 టెస్ట్‌లలో గెలిచింది, దక్షిణాఫ్రికా 26 మ్యాచ్‌లలో గెలిచింది. 21 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..