IND vs SA : ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ.. అందుకు కారణం చెప్పిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్

రాంచీలో ఓటమి తర్వాత, సౌతాఫ్రికా రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో అద్భుతంగా పుంజుకుంది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంలో ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీ చేసినా మ్యాథ్యూ బ్రీత్జ్‌కే ఆడిన ఇన్నింగ్స్ చాలా కీలకం. రాయ్‌పూర్‌లో బ్రీత్జ్‌కే 64 బంతుల్లో 68 పరుగులు చేయగా, రాంచీ వన్డేలో కూడా 80 బంతుల్లో 72 పరుగులు చేశాడు.

IND vs SA : ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ.. అందుకు కారణం చెప్పిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్
Matthew Breetzke

Updated on: Dec 05, 2025 | 4:58 PM

IND vs SA : రాంచీలో ఓటమి తర్వాత, సౌతాఫ్రికా రాయ్‌పూర్‌లో జరిగిన రెండో వన్డేలో అద్భుతంగా పుంజుకుంది. 359 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. ఈ విజయంలో ఎయిడెన్ మార్క్రమ్ సెంచరీ చేసినా మ్యాథ్యూ బ్రీత్జ్‌కే ఆడిన ఇన్నింగ్స్ చాలా కీలకం. రాయ్‌పూర్‌లో బ్రీత్జ్‌కే 64 బంతుల్లో 68 పరుగులు చేయగా, రాంచీ వన్డేలో కూడా 80 బంతుల్లో 72 పరుగులు చేశాడు. తొలిసారిగా భారత్‌కు వచ్చిన ఈ బ్యాటర్.. భారత బౌలింగ్‌ను ఎందుకు ఇంత సులభంగా ఎదుర్కొంటున్నాడు అనే ప్రశ్న అందరిలోనూ ఉంది. దీనిపై విశాఖపట్నం వన్డేకు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో బ్రీత్జ్‌కే స్వయంగా స్పందించాడు.

భారతదేశంలో బ్యాటింగ్ చేయడం చాలా సరదాగా ఉందని బ్రీత్జ్‌కే చెప్పాడు. “నేను బ్యాటింగ్‌ను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. బౌలర్ల గురించి నాకేం తెలీదు” అని నవ్వుతూ అన్నాడు. తాను ఇటీవల పాకిస్తాన్ నుంచి ఆడి వచ్చానని, అక్కడ పిచ్‌లు బ్యాటింగ్‌కు అనుకూలంగా లేవని, కానీ భారతదేశంలోని పరిస్థితులు మాత్రం పాకిస్తాన్‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయని తెలిపాడు. డ్యూ ప్రభావం కూడా తమకు చాలా పెద్ద కారణమని బ్రీత్జ్‌కే వెల్లడించాడు. సౌతాఫ్రికా రెండు మ్యాచ్‌లలో లక్ష్యాన్ని ఛేదించింది. రాత్రిపూట మంచు కురవడం వల్ల బౌలింగ్ చేయడం కష్టంగా మారుతోందని, అదే సమయంలో బంతి బ్యాట్‌పైకి సులభంగా వస్తుందని, ఇది బ్యాటింగ్‌కు అనుకూలంగా మారుతోందని అతను వివరించాడు.

బ్రీత్జ్‌కే మాట్లాడుతూ.. తమ లోయర్ ఆర్డర్ నుంచి కూడా తనకు చాలా ఆత్మవిశ్వాసం లభిస్తుందని చెప్పాడు. మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్ వంటి ఆటగాళ్ల పవర్ హిట్టింగ్ కారణంగానే, తమ టాప్ 4 బ్యాటర్లు మరింత స్వేచ్ఛగా, ఓపెన్‌గా ఆడగలుగుతున్నారని తెలిపాడు. కాగా బ్రీత్జ్‌కే కేవలం 11 వన్డే మ్యాచ్‌లలోనే 68.2 సగటుతో 682 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. టీమిండియా సిరీస్‌ను గెలవాలంటే ఈ ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను త్వరగా అవుట్ చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే టెస్ట్ సిరీస్ మాదిరిగానే వన్డేల్లో కూడా నిరాశ తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..