SA vs WI, T20 World Cup 2021: సూపర్ 12లో భాగంగా నేడు డబుల్ హెడర్స్‌లో భాగంగా దక్షిణాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ టీంల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. కీలమైన మ్యాచులో దక్షిణాఫ్రికా టీం విజయం సాధించి, సూపర్ 12లో తన స్థానాన్ని సేఫ్ జోన్‌లో ఉంచుకుంది. వెస్టిండీ ఇచ్చిన టార్గెన్‌ను 18.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి అద్భుత విజయం సాధించింది.
144 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలు పెట్టిన దక్షిణాఫ్రికా అనవసర పరుగు కోసం ప్రయత్నించి తొలి వికెట్‌ను రెండో ఓవర్‌లోనే కోల్పోయింది. తెంబా బవుమా కేవలం 2 పరుగులే చేసి రన్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. అనంరతం రీజా హెన్రిక్స్ కొద్ది సేపు అలరించినా 9.2వ ఓవర్లో రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 39 పరుగులు చేసి హెట్ మెయిర్ అద్భుత క్యాచ్‌కు ఔటయ్యాడు. అనంతరం డుసెన్ 43, మక్రాం 51 లు భారీ భాగస్వామ్యం అందించడంతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది.
ఈ మ్యాచులో దక్షిణాఫ్రికా కెప్టెన్ టెంబా బావుమా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. వెస్టిండీస్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. వెస్టిండీస్ జట్టు నెమ్మదిగా ఇన్నింగ్స్‌ను ప్రారంబించింది. లెండిల్ సిమన్స్, ఎవిన్ లూయిస్ తొలి మూడు ఓవర్లలో 6 పరుగులు మాత్రమే చేశారు. ఐదాన్ మార్క్రామ్ మెయిడిన్ పవర్ ప్లేలో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కగిసో రబడ నాల్గవ ఓవర్‌తో బరిలోకి వచ్చినా.. పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఆ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు వచ్చాయి.
తబ్రేజ్ షమ్సీ వేసిన 10వ ఓవర్‌లో ఐదో బంతికి లూయిస్ స్లాగ్ స్వీప్ చేస్తూ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదాడు. దీంతో అతని అర్ధ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. 33 బంతుల్లో మూడు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 50 పరుగులు చేశాడు. ఎవిన్ లూయిస్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాతి ఓవర్‌లోనే ఔటయ్యాడు. అతను డీప్ మిడ్ వికెట్ వద్ద కేశవ్ మహరాజ్‌కి క్యాచ్ ఇచ్చాడు. 35 బంతుల్లో 56 పరుగులు చేసి ఔటయ్యాడు.
కేశవ్ మహారాజ్ 13వ ఓవర్‌లో నికోలస్ పూరన్‌ను పెవిలియన్ చేర్చాడు. ఆ ఓవర్ రెండో బంతికి పూరన్ లాంగ్ ఆఫ్ వద్ద డేవిడ్ మిల్లర్ చేతికి చిక్కాడు. 7 బంతుల్లో 12 పరుగులు చేశాడు. ఇక 14వ ఓవర్ రెండో బంతికి లెండిల్ సిమన్స్‌ను కగిసో రబాడ ఔట్ చేశాడు. సిమన్స్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం వల్ల వెస్టిండీస్ పవర్ ప్లేలో భారీగా పరుగులు సాధించలేకపోయింది. 35 బంతుల్లో 16 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు.
ఇక 18వ ఓవర్ తొలి బంతికే క్రిస్ గేల్ పెవిలియన్ చేరాడు. గేల్ బ్యాట్ అంచుకు తగిలిన బంతి హెన్రిచ్ క్లాసెన్ అద్భుత క్యాచ్‌తో ఔట్ చేశాడు. గేల్ 12 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. ఎన్రిక్ నోకియా ఓవర్‌లో వెస్టిండీస్ రెండు ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది. ఆ ఓవర్ రెండో బంతికి 5 పరుగులు మాత్రమే చేసిన ఆండ్రీ రస్సెల్‌ను నోకియా బోల్తా కొట్టించింది. అదే ఓవర్ నాలుగో బంతికి షిమ్రాన్ హెట్మెయర్ కూడా రనౌట్ అయ్యాడు.
ఆఖరి ఓవర్ రెండో బంతికి కీరన్ పొలార్డ్ ఔట్ అయ్యాడు. ప్రిటోరియస్ వేసిన బంతికి అతను వాన్ డెర్ చేతికి చిక్కాడు. 20 బంతుల్లో 26 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. వెస్టిండీస్ టీం నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. జట్టు తరఫున లూయిస్ ఒక్కడే 56 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
Mohammed Shami: ఎట్టకేలకు స్పందించిన బీసీసీఐ.. ఆ బౌలర్ ఆటతో గర్వపడుతున్నామంటూ ట్వీట్..!