AUS vs SA: దంచికొట్టిన డికాక్, మార్క్రామ్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్.. ఓడితే పంచ్ పడినట్లే..

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టు ఓపెనర్ క్వింటన్ డి కాక్ సెంచరీ చేశాడు. కాగా, ఐడెన్ మార్క్రామ్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆస్ట్రేలియా ముందు 312 పరుగుల టార్గెట్ నిలిచింది. ఆస్ట్రేలియా తరుపున స్పిన్‌ ఆల్‌రౌండర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ స్టార్క్‌ తలో 2 వికెట్లు తీశారు. కాగా, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ తలో వికెట్ సాధించారు.

AUS vs SA: దంచికొట్టిన డికాక్, మార్క్రామ్.. ఆస్ట్రేలియా ముందు భారీ టార్గెట్.. ఓడితే పంచ్ పడినట్లే..
Aus Vs Sa Score

Updated on: Oct 12, 2023 | 6:44 PM

Australia vs South Africa, 10th Match: ప్రపంచ కప్ 2023లో 10వ మ్యాచ్ లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఎకానా స్టేడియంలో ఆస్ట్రేలియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోంది. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. ఆ జట్టు ఓపెనర్ క్వింటన్ డి కాక్ సెంచరీ చేశాడు. కాగా, ఐడెన్ మార్క్రామ్ అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.

ఆస్ట్రేలియా తరుపున స్పిన్‌ ఆల్‌రౌండర్లు గ్లెన్‌ మాక్స్‌వెల్‌, మిచెల్‌ స్టార్క్‌ తలో 2 వికెట్లు తీశారు. కాగా, పాట్ కమిన్స్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ తలో వికెట్ సాధించారు.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించాలంటే 50 ఓవర్లలో 312 పరుగులు చేయాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు 6 ముఖ్యమైన క్యాచ్‌లను వదులుకుంది.

రెండు జట్లలో ప్లేయింగ్-11..


ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్.

దక్షిణాఫ్రికా: టెంబా బావుమా (కెప్టెన్), క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రాస్సీ వాన్ డెర్ డస్సెన్, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, కగిసో రబడ, తబ్రైజ్ షమ్సీ, లుంగీ ఎన్గిడి.

ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్..

ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది రెండో మ్యాచ్. ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌లో భారత్‌తో 6 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. కాగా, దక్షిణాఫ్రికా 102 పరుగుల భారీ తేడాతో శ్రీలంకను ఓడించింది. ప్రపంచకప్‌నకు ముందు ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..