ప్రపంచ క్రికెట్ చరిత్రలో అతనో అద్భుతం. దూకుడుకు నయా మీనింగ్ చెప్పిన క్రికెట్ నవాబ్. ఇలా సౌరవ్ గంగూలీ( Sourav Ganguly) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో టీమిండియాకు ఊపిరిపోసిన బాహుబలి గంగూలీ. గ్రౌండ్‌లో టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలిపాడు. భారత క్రికెట్ ముఖచిత్రాన్నే మార్చేసిన కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఎందరో గొప్ప ప్లేయర్లను క్రికెట్ ప్రపంచానికి పరిచయం చేసిన దాదా.. బీసీసీఐ చీఫ్ గంగూలీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టబోతున్నారా..? మాజీ క్రికెటర్ అడుగులు పొలిటికల్ వైపు మరోసారి పడుతున్నాయా..? అవుననే అంటున్నారు జాతీయ రాజకీయ విశ్లేషకులు. భారత క్రికెట్‌ను శాసించిన సౌరవ్.. లేటెస్ట్‌గా రాజకీయాలపై మరోసారి దృష్టిసారించారు. ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతున్నాడు.
2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సౌరవ్ గంగూలీ రాజకీయాల్లోకి రావడంపై భారీ అంచనాలు సాగిన సంగతి తెలిసిందే. అయితే, సౌరవ్ ఆరోగ్యం క్షీణించడంతో అతని చుట్టూ ఉన్న రాజకీయ ఊహాగానాలు అకస్మాత్తుగా క్లాజ్ అయ్యాయి. 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సౌరవ్ గురించి మరోసారి ఊహాగానాలు మొదలయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మరోసారి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వీరి భేటీపై ఇప్పుడు రాజధాని రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు జోరందుకున్నాయి.
కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనే భారత అథ్లెట్లకు స్వాగతం పలికేందుకు శుక్రవారం మధ్యాహ్నం ఓ కార్యక్రమం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ హాజరయ్యారు. అంతేకాదు ఆ సందర్భంగా మోదీ-షాలతో సౌరవ్ ముచ్చటించారు.
ప్రస్తుతం సౌరవ్ ఐసీసీ ప్రెసిడెంట్ రేసులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ వాతావరణంలో మోదీ-షాలతో సౌరవ్ మాట్లాడిన అంశం క్రికెట్ పరిపాలనా వ్యవహారానికి సంబంధించిన అంశం కావచ్చునని భావిస్తున్నారు. కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా అక్కడే ఉన్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్ పరిపాలనలో అనురాగ్ ప్రభావం చాలా ఉంది. కాగా, బీసీసీఐలో సౌరవ్, అమిత్ కుమారుడు జై షా పదవీకాలం ఇప్పటికే ముగిసింది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ బోర్డు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ వాతావరణంలో క్రికెట్ పరిపాలనపై బీజేపీ అగ్రనేతలు సౌరవ్‌తో చర్చించినట్లుగా తెలుస్తోంది.
అయితే ఈ విషయంలో బీసీసీఐ అధ్యక్షుడు కానీ, బీజేపీ కానీ ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. సౌరవ్ బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగితే ఐసీసీ అధ్యక్షుడు కాలేడు. పదవీకాలం ముగిశాక బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండనప్పటికీ, ఐసీసీ అధిపతి రేసు నుంచి తప్పుకున్నాడు. ఈ వాతావరణంలో జై షా చేతిలో అధికారంతో సౌరవ్ ఐసిసిలో ఏమి చేస్తాడనే దానిపై అందరి దృష్టి ఉంది.
మరిన్ని జాతీయ, క్రీడా వార్తల కోసం