Sourav Ganguly vs Virat: విరాట్ కోహ్లీకి షోకాజ్ నోటీసులు జారీ చేస్తారంటూ వస్తున్న వార్తలపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించారు. ఆ వార్తలన్నీ గాలి వార్తలంటూ ఖండించారు. ఇదే అంశంపై మీడియాతో మాట్లాడిన దాదా.. ‘‘తనకు అలాంటి ఉద్దేశం లేదు. ఈ వార్త అస్సలు నిజం కాదు.’’ అని కుండబద్దలుకొట్టారు. దక్షిణాఫ్రికా టూర్‌కు బయలుదేరే ముందు విలేకరుల సమావేశంలో కోహ్లీ కెప్టెన్సీ ఇష్యూపై కీలక కామెంట్స్ చేశాడు. ఆ కామెంట్స్ నేపథ్యంలో కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపేందుకు గంగూలీ సిద్ధమయ్యారనే వార్తలు వచ్చాయి. ఇప్పుడివన్నీ అవాస్తవాలని తేల్చిపడేశారు బీసీసీఐ ప్రెసిడెంట్.
విరాట్-గంగూలీ వివాదం?
2021 టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20ఐ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు కోహ్లి గతేడాది సెప్టెంబర్‌లో ప్రకటించడంతో కెప్టెన్సీ కథ మొదలైంది. ఆ తరువాత టెస్ట్, వన్డే లకు కెప్టెన్సీ వహించాలని తన కోరికను వ్యక్తం చేసినప్పటికీ, కోహ్లీని వన్డే కెప్టెన్‌గా కూడా తొలగించారు. వన్డే కెప్టెన్‌గా తొలగించిన డిసెంబరులో భారత్ – దక్షిణాఫ్రికా సిరీస్‌కు ముందు కోహ్లీ సంచలన కామెంట్స్ చేశాడు. దాదా లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 కెప్టెన్సీని వదులుకోవద్దని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తనను కోరినట్లు చేసిన వ్యాఖ్యలను కోహ్లీ ఖండించాడు. అధికారికంగా నిర్ణయం తీసుకోవడానికి తొంభై నిమిషాల ముందు వన్డే కెప్టెన్‌గా తొలగిస్తున్నట్లు తనకు తెలియజేసినట్లు కోహ్లీ వెల్లడించాడు. అయితే, సెలెక్టర్లు భారత్‌కు వైట్‌బాల్ కెప్టెన్‌గా ఒక్కరినే ఉంచాలని డిసైడ్ అయ్యారు. ఈ కారణంగానే కోహ్లీని వన్డే కెప్టెన్‌గా తొలగించినట్లు బీసీసీఐ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.
ఇదిలాఉంటే.. ఇటీవల ముగిసిన టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 2-1 తేడాతో టీమిండియా ఓటమి పాలైన ఒక రోజు తర్వాత కోహ్లీ టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి కూడా తప్పుకున్నాడు. టెస్టు కెప్టెన్సీ నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించాడు. ఈ వివాదం ఇలా రాజుకుంటుండగానే.. కోహ్లీకి షోకాజ్ నోటీసులు పంపాలని గంగూలీ సిద్ధమయ్యాడంటూ వార్తలు కలకం రేపాయి.
Also read:
Hyderabad: విడాకుల కోసం వచ్చిన మహిళను ట్రాప్ చేసిన లాయర్.. వీడియోలు తీసి.. శారీరకంగా
Crime News: ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్! బాటసారులను అడవిలోకి లాక్కెళ్లి..
కేంద్రం కీలక నిర్ణయం.. 35 యూట్యూబ్ ఛానెల్స్, 2 వెబ్‌సైట్‌లపై నిషేధం..?