
Smriti Mandhana : భారత మహిళల క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. ఈ మధ్యే దేశానికి తొలిసారిగా వరల్డ్ కప్ అందించడంలో కీలక పాత్ర పోషించి చరిత్ర సృష్టించింది. ఆ గెలుపు సంబరాలు ముగియకముందే ఆమె తన జీవితంలో మరో కొత్త ఘట్టాన్ని ప్రారంభించబోతోంది. కొద్ది రోజులుగా అభిమానుల్లో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ, స్మృతి మంధాన వివాహ తేదీ ఖరారైంది. ఆమె తన ప్రియుడు, మ్యూజిక్ డైరెక్టర్ అయిన పలాష్ ముచ్ఛల్ ను ఈ నెల 23న వివాహం చేసుకోబోతోంది.
నవంబర్ 23న వివాహం, సాంగ్లీలో వేడుక
స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్‌లు ఈ నెల నవంబర్ 23న వివాహ బంధంతో ఏడు అడుగులు వేయబోతున్నారు. వీరి వివాహ ఆహ్వాన పత్రిక కూడా కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొదట్లో ఇది వదంతులే అనుకున్నా, ఇప్పుడు పెళ్లి తేదీ అధికారికంగా ఖరారు అయినట్లు స్పష్టమైంది. వీరి వివాహం మహారాష్ట్రలోని స్మృతి మంధాన స్వస్థలం సాంగ్లీలో జరగనుంది.
ప్రేమ బంధం, పలాష్ ముచ్ఛల్ హింట్
స్మృతి మంధాన, పలాష్ ముచ్ఛల్‌లు గత కొన్ని సంవత్సరాలుగా తరచుగా కలిసి కనిపిస్తున్నారు. దాదాపు రెండేళ్ల క్రితమే వీరిద్దరూ తమ ప్రేమ బంధాన్ని బహిరంగంగా వెల్లడించారు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ కప్ 2025లో ఒక మ్యాచ్ సందర్భంగా, పలాష్ ముచ్ఛల్ మాట్లాడుతూ.. స్మృతి త్వరలో తన సొంత నగరం ఇండోర్‌కు కోడలు కాబోతోందని చెప్పి వివాహం గురించి హింట్ ఇచ్చారు. ఆ సమయంలో భారత జట్టు ఇంగ్లాండ్‌తో మ్యాచ్ కోసం ఇండోర్‌లోనే ఉంది.
డబుల్ ధమాకా: వరల్డ్ కప్ తర్వాత పెళ్లి
నవంబర్ 2025 స్మృతి మంధాన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన నెలగా నిలిచింది. సరిగ్గా నవంబర్ 2న భారత జట్టు సౌతాఫ్రికాను ఓడించి తొలిసారిగా ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఆ టోర్నమెంట్‌లో మంధాన భారత జట్టు తరఫున అత్యధికంగా 434 పరుగులు చేసింది. వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన కేవలం మూడు వారాల తర్వాత, ఆమె ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ పలాష్ ముచ్ఛల్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..