
Smriti Mandhana: టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన తన వ్యక్తిగత జీవితంలో జరిగిన ఒక ఊహించని పరిణామాన్ని పక్కనపెట్టి, దేశం కోసం తిరిగి మైదానంలోకి దిగారు. సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌తో జరగాల్సిన తన వివాహం రద్దయినట్లు ప్రకటించిన మరుసటి రోజే ఆమె క్రికెట్ ప్రాక్టీస్ మొదలుపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.
స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, స్మృతి తండ్రి అనారోగ్యం కారణంగా వాయిదా పడింది. అయితే, తాజాగా ఈ పెళ్లి పూర్తిగా రద్దయినట్లు (called off) స్మృతి సోషల్ మీడియా ద్వారా ధృవీకరించిన సంగతి తెలిసిందే. “నా పెళ్లి ఆగిపోయింది. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలనుకుంటున్నాను. దయచేసి మా కుటుంబాల ప్రైవసీని గౌరవించండి” అని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో కోరారు.
SMRITI MANDHANA IS BACK 🔥
– She has started the practice for the Sri Lanka T20I series. pic.twitter.com/nawrH7ETnB
— Johns. (@CricCrazyJohns) December 8, 2025
ఈ వ్యక్తిగత బాధ నుంచి తేరుకోవడానికి సమయం తీసుకోకుండా, స్మృతి వెంటనే తన కర్తవ్యానికి ప్రాధాన్యత ఇచ్చారు. డిసెంబర్ 21 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న 5 మ్యాచ్‌ల టి20 సిరీస్ కోసం ఆమె నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ కనిపించింది.
🚨 OFFICIAL STATEMENT BY SMRITI MANDHANA 🚨#SmritiMandhana pic.twitter.com/tik9feNeCI
— lndian Sports Netwrk (@IS_Netwrk29) December 7, 2025
“నన్ను నడిపించేది దేశమే. అత్యున్నత స్థాయిలొ నా దేశానికి ప్రాతినిధ్యం వహించడమే నాకు ముఖ్యం. సాధ్యమైనంత కాలం భారత్ తరపున ఆడి ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం,” అని స్మృతి తన అంకితభావాన్ని చాటుకుంది.
వ్యక్తిగత జీవితంలో క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఆటపై ఆమెకున్న నిబద్ధతను చూసి అభిమానులు, క్రికెట్ వర్గాలు ఆమెను ప్రశంసిస్తున్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..