SL vs IND: మూడో వన్డేలోనూ చిత్తుగా ఓడిన టీమిండియా.. సిరీస్ శ్రీలంక వశం.. 27 ఏళ్ల రికార్డు బద్దలు..

టీ 20 ప్రపంచకప్ గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియాకు శ్రీలంక షాక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్ లో 0-2 తేడాతో భారత జట్టును ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది. బుధవారం (ఆగస్టు 07) కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఆతిథ్య జట్టు ఏకంగా 110 పరుగుల తేడాతో విజయం సాధించింది.

SL vs IND: మూడో వన్డేలోనూ చిత్తుగా ఓడిన టీమిండియా.. సిరీస్ శ్రీలంక వశం.. 27 ఏళ్ల రికార్డు బద్దలు..
India Vs Srilanka
Follow us

|

Updated on: Aug 07, 2024 | 9:11 PM

టీ 20 ప్రపంచకప్ గెలిచి ఫుల్ జోష్ లో ఉన్న టీమిండియాకు శ్రీలంక షాక్ ఇచ్చింది. మూడు వన్డేల సిరీస్ లో 0-2 తేడాతో భారత జట్టును ఓడించి సిరీస్ ను కైవసం చేసుకుంది. బుధవారం (ఆగస్టు 07) కొలంబో ఆర్. ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్-శ్రీలంక మధ్య జరిగిన చివరిదైన మూడో వన్డేలో ఆతిథ్య జట్టు ఏకంగా 110 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ ఆరంభానికి ముందు ఫేవరెట్ గా బరిలోకి దిగిన రోహిత్ జట్టు మూడు వన్డేల్లో కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. సిరీస్ లో వరుస పరాజయాలను మూట గట్టుకుంది. ఫేవరెట్ గా బరిలోకి దిగిన రోహిత్ జట్టు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక ఘోర పరాజయాన్ని చవిచూసింది. విచిత్రం ఏమిటంటే.. ఈ సిరీస్‌లో 8వ ఆర్డర్‌ వరకు బ్యాటర్లు ఉన్న టీమ్‌ఇండియా మూడు మ్యాచ్‌ల్లోనూ 250 కంటే తక్కువ లక్ష్యాన్ని ఛేదించలేక చతికిల పడింది. దీంతో 1997 తర్వాత అంటే సరిగ్గా 27 ఏళ్ల తర్వాత శ్రీలంకలో వన్డే సిరీస్‌ను కోల్పోయి టీమిండియా పేలవమైన రికార్డును లిఖించింది. అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం జట్టు కొత్త కోచ్ గౌతం గంభీర్‌ను ఆందోళనకు గురి చేసింది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 248 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. దీనికి సమాధానంగా టీమిండియా 138 పరుగులకే ఆలౌటైంది. ఆశ్చర్యకరంగా స్టార్ బ్యాటర్లతో కూడిన భారత జట్టు పూర్తి 50 ఓవర్లు ఆడలేక కేవలం 26.1 ఓవర్లలోనే తన ఇన్నింగ్స్‌ను ముగించింది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా 9 మంది బ్యాటర్లను రంగంలోకి దించింది. అయితే శ్రీలంక స్పిన్‌కు అనుకూలమైన పిచ్‌పై రోహిత్ శర్మ మినహా మరే బ్యాటర్ సత్తా చాటలేకపోయారు. శ్రేయాస్ అయ్యర్ 8 పరుగులు, అక్షర్ పటేల్ 2 పరుగుల వద్ద, ర్యాన్ పరాగ్ 15 పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. శివమ్ దూబే కేవలం 9 పరుగులకే ఔట్ కాగా, చివర్లో వాషింగ్టన్ సుందర్ 30 పరుగులతో ఒంటరి పోరాటం చేశాడు. అంతకు ముందు శుభ్‌మన్‌ గిల్ తో పాటు విరాట్ కోహ్లీ కూడా త్వరగానే ఔటయ్యారు.

భారత జట్టు ఓటమికి ప్రధాన కారణం శ్రీలంక స్పిన్నర్ల దాడి. ముఖ్యంగా భారత బ్యాట్స్‌మెన్‌లకు ధీటుగా నిలిచిన లెఫ్టార్మ్ స్పిన్నర్ దునిత్ వెల్లాల కేవలం 31 బంతుల్లోనే 5 వికెట్లు పడగొట్టి సిరీస్‌లో రెండోసారి ఐదు వికెట్లు తీసిన ఘనత సాధించాడు. అతడితో పాటు లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే 2 వికెట్లు తీయగా, మహేశ్ థిక్షన్, అసిత ఫెర్నాండో ఒక్కో వికెట్ తీశారు. రోహిత్ శర్మ మినహా టీమిండియా బ్యాటర్ ఎవరూ వన్డే సిరీస్‌లో చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు. రోహిత్ మొత్తం సిరీస్‌లో 157 పరుగులు చేసి భారత్ తరఫున సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మిగిలిన ఆటగాళ్లలో అక్షర్ పటేల్ 79 పరుగులు, విరాట్ కోహ్లీ 58 పరుగులు మాత్రమే, ఓపెనర్ శుభ్‌మన్ గిల్ 57 పరుగులు, సుందర్ 50 పరుగులు చేశారు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఆడే అవకాశం దక్కించుకున్న కేఎల్ రాహుల్ 31 పరుగులు, అయ్యర్ 38 పరుగులు మాత్రమే చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మూడో వన్డేలోనూ చిత్తుగా ఓడిన టీమిండియా.. సిరీస్ శ్రీలంక వశం
మూడో వన్డేలోనూ చిత్తుగా ఓడిన టీమిండియా.. సిరీస్ శ్రీలంక వశం
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఆ 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
పెళ్లిపీటలెక్కనున్న భారతీయుడు 2 హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?
పెళ్లిపీటలెక్కనున్న భారతీయుడు 2 హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?
హైకోర్ట్ స్పీకర్‌కి డైరెక్షన్ ఇస్తుందా? నేరుగా తీర్పే ఇస్తుందా?
హైకోర్ట్ స్పీకర్‌కి డైరెక్షన్ ఇస్తుందా? నేరుగా తీర్పే ఇస్తుందా?
వరద ఉధృతి.. ఒక్కసారిగా నదిలో కూలిన వంతెన.. వీడియో చూశారా?
వరద ఉధృతి.. ఒక్కసారిగా నదిలో కూలిన వంతెన.. వీడియో చూశారా?
బీమాతో జీవితానికి ధీమా.. నయా పాలసీలను ప్రకటించిన ఎల్ఐసీ
బీమాతో జీవితానికి ధీమా.. నయా పాలసీలను ప్రకటించిన ఎల్ఐసీ
గ్రేటర్‌ విశాఖపై కూటమి జెండా.. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో..
గ్రేటర్‌ విశాఖపై కూటమి జెండా.. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో..
హిట్ సినిమాల్లో కేరక్టర్లకు సూపర్ క్రేజ్..
హిట్ సినిమాల్లో కేరక్టర్లకు సూపర్ క్రేజ్..
శ్రీలంక ఆటగాడితో గొడవపడిన మహ్మద్ సిరాజ్..
శ్రీలంక ఆటగాడితో గొడవపడిన మహ్మద్ సిరాజ్..
యాదాద్రీశుడికి రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే..?
యాదాద్రీశుడికి రికార్డుస్థాయిలో హుండీ ఆదాయం.. ఎన్ని కోట్లంటే..?