TV9 Telugu
4 August 2024
టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత, తదుపరి ICC టోర్నమెంట్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. ఇది పాకిస్థాన్‌లో నిర్వహించనున్నారు.
ఆసియా కప్ 2025కి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. మీడియా కథనాల ప్రకారం, ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూప్‌లో ఉంచారు.
సూపర్-4 దశ ముగిసే సమయానికి భారత్, పాకిస్థాన్ జట్లు అగ్రస్థానంలో నిలిస్తే.. టోర్నీలో చివరి మ్యాచ్ కూడా ఈ రెండు జట్ల మధ్యే జరుగుతుంది.
అంతా సవ్యంగా సాగితే ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు మూడుసార్లు తలపడనున్నాయి. ఇది ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ కంటే ఎక్కువే.
34 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఆసియా కప్ ఆతిథ్య హక్కులను భారత్ దక్కించుకుంది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఐసీసీ రూ. 586 కోట్ల బడ్జెట్‌ను ఆమోదించింది. ఇది కాకుండా ఇతర ఖర్చుల కోసం పీసీబీకి మరో రూ.38 కోట్లు ఇచ్చారు.
టోర్నీలో పాల్గొనేందుకు తమ జట్టును పాకిస్థాన్‌కు పంపబోమని బీసీసీఐ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో పాక్ మాజీలు కూడా చాలా మంది టెన్షన్‌లో ఉన్నారు.
పాకిస్థాన్‌కు పంపేలా బీసీసీఐని ఐసీసీ ఒప్పిస్తుందని పీసీబీ నమ్మకంగా ఉంది. అందుకే పీసీబీ ఈ విషయంపై ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు.