TV9 Telugu
6 August 2024
పారిస్ ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రోలో భారత ఛాంపియన్ ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి తన సత్తా చాటాడు.
నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్‌లో తన మొదటి త్రోను 89.34 మీటర్ల దూరంలో విసిరాడు. దీంతో రికార్డు స్థాయిలో ప్రదర్శన చేసి ఫైనల్స్‌కు చేరుకున్నాడు.
ఆగస్ట్ 8న నీరజ్ చోప్రా ఫైనల్ మ్యాచ్ ఆడనున్నాడు. ఈసారి కూడా గోల్డ్ పతకం సాధించాలని కోరుకుంటున్నాడు.
నీరజ్ చోప్రా ఫైనల్ ఇప్పుడు ఆగస్టు 8న జరగనుంది. జర్మనీకి చెందిన వెబర్, గ్రెనడాకు చెందిన అండర్సన్ పీటర్స్, పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ అతనికి కీలక ప్రత్యర్థులుగా మారనున్నారు.
ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, టోక్యో తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లో నీరజ్ చోప్రా సందడి చేసిన జావెలిన్ ధర ఎంత?
నీరజ్ చోప్రా ఈటె ధర రూ.1.10 లక్షలు. నీరజ్ చోప్రా అలాంటి 4 నుంచి 5 జావెలిన్‌లను తన వెంట తీసుకువెళ్లాడు.
నివేదికల ప్రకారం, భారత ప్రభుత్వం నీరజ్ చోప్రాకు 100 కంటే ఎక్కువ జావెలిన్లు, ఇతర పరికరాలను అందించింది.
ఒలంపిక్స్ కోసం నీరజ్ చోప్రాపై భారత ప్రభుత్వం రూ.5 కోట్ల 72 లక్షలు వెచ్చించినట్లు ఓ నివేదిక వెల్లడించింది.