ఆఖరి టెస్ట్‌లోను మారని ఆస్ట్రేలియా అభిమానుల తీరు.. మహ్మద్ సిరాజ్‌‌పై మళ్లీ దురహంకార వ్యాఖ్యలు..

|

Jan 16, 2021 | 7:28 AM

Mohammed Siraj: సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఆకతాయిల్ని స్టేడియం నుంచి బయటకు పంపించినా

ఆఖరి టెస్ట్‌లోను మారని ఆస్ట్రేలియా అభిమానుల తీరు.. మహ్మద్ సిరాజ్‌‌పై మళ్లీ దురహంకార వ్యాఖ్యలు..
Follow us on

Mohammed Siraj: సిడ్నీ టెస్టులో భారత ఆటగాళ్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఆకతాయిల్ని స్టేడియం నుంచి బయటకు పంపించినా నాలుగో టెస్టులోనూ మళ్లీ అలాంటి ఘటనే రిపీట్ అయింది. గబ్బా మైదానంలో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో భారత ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్‌, వాషింగ్టన్‌ సుందర్‌పై ఆస్ట్రేలియా అభిమానులు దురహంకార వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం స్థానికంగా ఉన్న అక్కడి మీడియానే ప్రకటించింది. అందుకు సంబంధించిన వీడియో కూడా పోస్ట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

నాలుగో టెస్ట్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సిరాజ్‌ను లక్ష్యంగా చేసుకొని ఆస్ట్రేలియన్లు దూషించారు. సిరాజ్‌ను దూషిస్తూ పాడటమే గాక, అనుచిత పదాలు వాడారని తెలిపింది. సిడ్నీ టెస్టులో మాదిరిగా సిరాజ్‌కు యాదృచ్ఛికంగా ఇలాంటి సంఘటన ఎదురవ్వలేదని, కావాలని చేసినట్లుగా ఉందని పేర్కొంది. దీనిపై ఇప్పటి వరకు టీమిండియా యాజమాన్యం, క్రికెట్ ఆస్ట్రేలియా, ఐసీసీ స్పందించలేదు.