2027 వరల్డ్ కప్ టీమ్‌లో ఎవరెవరు ఉండాలో కోహ్లీ చెప్పేశాడు! కెప్టెన్ గిల్ సంచలన స్టేట్‌మెంట్

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీతో 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికలపై చర్చించినట్లు వెల్లడించారు. దక్షిణాఫ్రికా పరిస్థితులకు అనుగుణంగా జట్టు కూర్పు, ఆటగాళ్ల ఎంపికపై కోహ్లీ సలహాలు తీసుకున్నట్లు గిల్ తెలిపారు. స్టార్ ప్లేయర్లు ఎవరు ఆడాలి, ఎవరు ఆడకూడదనే విషయంలో కోహ్లీకి స్పష్టమైన అవగాహన ఉందని గిల్ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

2027 వరల్డ్ కప్ టీమ్‌లో ఎవరెవరు ఉండాలో కోహ్లీ చెప్పేశాడు! కెప్టెన్ గిల్ సంచలన స్టేట్‌మెంట్
Shubman Gill Virat Kohli

Updated on: Jul 13, 2026 | 6:29 PM

ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నెల 14 నుంచి మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ఇప్పటికే 5 టీ20ల సిరీస్ పూర్తి చేసుకున్న భారత జట్టు, ఇక శుబ్‌మన్ గిల్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్‌తో మూడు వన్డేలు ఆడనుంది. 14, 16, 19 తేదీల్లో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఇప్పటికే ఇంగ్లాండ్ చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ చేసుకున్నారు. కాగా, ఆదివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో సీనియర్ ప్లేయర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ప్రస్తుత కెప్టెన్ గిల్‌తో ఏదో విషయంపై సీరియస్‌గా మాట్లాడుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి.

అసలు విరాట్ కోహ్లీ మీతో ఏం చెప్పాడని రిపోర్టర్లు శుబ్‌మన్ గిల్‌ను ప్రశ్నించగా.. గిల్ షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు. దక్షిణాఫ్రికాలో జరగబోయే 2027 వన్డే ప్రపంచ కప్ కోసం టీమ్ కాంబినేషన్, ప్రణాళిక, ఏ ఆటగాళ్లు ఆడాలి, ఎవరు ఆడకూడదు, దక్షిణాఫ్రికాలో ఏ ఆటగాళ్లు జట్టుకు ఉపయోగపడతారు అనే విషయాలపై నేను విరాట్ కోహ్లీ భాయ్‌తో వివరంగా చర్చించాను అని గిల్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశాడు. జట్టులో ఎవరు ఉండాలో విరాట్ కోహ్లీ ఒక స్పష్టమైన ఆలోచనతో ఉన్నట్లు గిల్ వ్యాఖ్యలు బట్టి అర్థం అవుతుంది.

ఎలాగైనా 2027లో వన్డే వరల్డ్ కప్ గెలిచి తీరాలనే కసితో ఉన్న గిల్, కచ్చితంగా విరాట్ కోహ్లీ సలహాలు, సూచనలు తీసుకొని అందుకు తగ్గట్లే తన టీమ్ రెడీ చేసుకుంటాడని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డే వరల్డ్ కప్ టీమ్‌లో ఉంటారా? లేదా అనుమానాలు చాలా వినిపించాయి. కానీ, గిల్ చెప్పిన ఈ ఒక్క మాటతో విరాట్ కోహ్లీ కచ్చితంగా వరల్డ్ కప్ ఆడటంతో పాటు, గెలిచే టీమ్‌ను రెడీ చేసే పనిలో ఉన్నాడని క్లియర్‌గా అర్థం అవుతుంది. అయితే అసలు మ్యాటర్ ఏంటంటే.. విరాట్ కోహ్లీ ఏ ప్లేయర్లను వరల్డ్ కప్ కోసం టీమ్లోకి తీసుకోమన్నాడు? ఇప్పుడున్న వారిలో ఎవరు సౌతాఫ్రికా కండీషన్స్‌కు పనికి రారు అని చెప్పాడనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us