Video: అకాయ్‌కి ‘మామ’గా మారిన శుభ్‌మన్ గిల్.. కోహ్లికి అదిరిపోయే రిప్లై..!

Shubman Gill Uncle Akaay Viral Reel: విరాట్ కోహ్లీ కుమారుడు అకాయ్ కోహ్లీ మామగా పిలుస్తున్న వైరల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌పై శుభ్‌మన్ గిల్ స్పందించాడు. అలాగే, విరాట్ కోహ్లీని ట్యాగ్ చేస్తూ ఓ కామెంట్ కూడా చేశాడు. అసలేంటి ఈ అంకుల్ మ్యాటర్, అకాయ్ ఎందుకు అంకుల్ అని పిలిచాడో ఇప్పుడు తెలుసుకుందాం..!

Video: అకాయ్‌కి మామగా మారిన శుభ్‌మన్ గిల్.. కోహ్లికి అదిరిపోయే రిప్లై..!
Shubman Gill Turns Uncle For Virat Kohli's Son Akaay

Updated on: Sep 04, 2026 | 1:31 PM

Shubman Gill Uncle Akaay Viral Reel: టీమిండియా స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ సోషల్ మీడియాలో చేసిన ఓ సరదా కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. విరాట్ కోహ్లి కుమారుడు అకాయ్‌ను ఉద్దేశించి రూపొందించిన ఓ ఫన్నీ ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో గిల్‌ను ‘అంకుల్‌’గా పేర్కొనగా.. గిల్ కూడా అదే స్థాయిలో ఫన్నీగా స్పందించాడు. విరాట్ కోహ్లిని ట్యాగ్ చేస్తూ “bhai dw I gotchu” అంటూ కామెంట్ చేశాడు.

అసలు రీల్‌లో ఏముంది..?

ఓ కంటెంట్ క్రియేటర్ అకాయ్ స్కూల్ టీచర్‌గా నటిస్తూ ఈ కామెడీ వీడియో రూపొందించారు. చిన్న తప్పు చేసిన అకాయ్‌ను టీచర్ మందలించి.. మరుసటి రోజు అతడి తల్లిదండ్రులు విరాట్ కోహ్లి, అనుష్క శర్మను స్కూల్‌కు తీసుకురావాలని చెబుతుంది.

ఇవి కూడా చదవండి

ఎక్కువమంది చదివినది: 10880, 124, 18లతో లేడీ కోహ్లీ విధ్వంసం.. మిథాలీ ఆల్ టైం రికార్డ్ బ్రేక్.. హిస్టరీలోనే సరికొత్త క్రికెట్ క్వీన్‌గా..

అంతటితో ఆగకుండా.. సరదాగా ‘అంకుల్ శుభ్‌మన్ గిల్‌’ను కూడా తీసుకురావాలి అని అకాయ్‌కు చెబుతుంది. ఈ సన్నివేశం సోషల్ మీడియాలో అభిమానులను నవ్వించింది.

గిల్ ఇచ్చిన రిప్లై ఏంటంటే..

రీల్‌ వైరల్ కావడంతో గిల్‌ కూడా దానిపై స్పందించాడు. విరాట్ కోహ్లిని ట్యాగ్ చేస్తూ “bhai dw I gotchu” అని రాశాడు. దీని అర్థం.. “భాయ్.. టెన్షన్ పడొద్దు, నేను చూసుకుంటా” అన్నమాట.

గిల్‌ స్వయంగా ఈ జోక్‌లో భాగం కావడంతో అభిమానుల నుంచి భారీగా స్పందనలు వచ్చాయి. కోహ్లి-గిల్ మధ్య ఉన్న స్నేహపూర్వక అనుబంధాన్ని మరోసారి ఈ సరదా ఘటన చూపించిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కువమంది చదివినది: Video: మ్యాజిక్ బాల్‌తో మెంటలెక్కించిన టీమిండియా ఛీ కొట్టిన ప్లేయర్.. వీడియో చూస్తే..!

త్వరలో మళ్లీ ఒకే జట్టులో..

విరాట్ కోహ్లి, శుభ్‌మన్ గిల్‌ త్వరలోనే భారత వన్డే జట్టులో కలిసి కనిపించనున్నారు. సెప్టెంబర్ 27 నుంచి వెస్టిండీస్‌తో భారత్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. దీంతో ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లు మళ్లీ ఒకే డ్రెస్సింగ్ రూమ్‌లో కనిపించనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us