
Shubman Gill : అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించినప్పటికీ.. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాత్రం ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నాడు. ఈ మ్యాచ్ ద్వారా యువ ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్ అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అయితే ఈ సెలెక్షన్ వెనుక పక్కా పక్షపాతం, స్నేహితులకు కొమ్ముకాయడం ఉందంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్ వేదికగా క్రికెట్ అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్న ఆటగాళ్లను కాదని, గిల్ తన క్లోజ్ ఫ్రెండ్‌కు టీమ్‌లో చోటు ఇచ్చాడని ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.
టాస్ ముగిసిన వెంటనే భారత ప్లేయింగ్ ఎలెవన్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దేశవాళీ వన్డే ఫార్మాట్లో అద్భుతమైన రికార్డులు ఉన్న యువ పేసర్ ప్రిన్స్ యాదవ్‌ను బెంచ్‌కే పరిమితం చేసి, గుర్నూర్ బ్రార్‌ను జట్టులోకి తీసుకోవడంపై చర్చ మొదలైంది. నెటిజన్లు ఇద్దరు బౌలర్ల రికార్డులను పోలుస్తూ గిల్‌ను కడిగిపారేస్తున్నారు. ప్రిన్స్ యాదవ్ కేవలం 14 దేశవాళీ వన్డేల్లోనే 29 వికెట్లు పడగొట్టగా.. గుర్నూర్ బ్రార్ మాత్రం 9 మ్యాచ్‌ల్లో కేవలం 12 వికెట్లు మాత్రమే తీశాడు. అంతకంటే మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ప్రిన్స్‌ను కాదని బ్రార్‌ను ఎలా ఎంపిక చేస్తారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ కనెక్షన్ ఏంటి?
ఈ వివాదం ఇంతలా ముదరడానికి ప్రధాన కారణం గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ ఫ్రాంచైజీయే. ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని గుర్నూర్ బ్రార్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.1.30 కోట్లు పెట్టి కొనుగోలు చేసింది. అయితే అక్కడ అతడు కేవలం బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. తన ఐపీఎల్ ఫ్రాంచైజీ జట్టులో ఉన్న ఆటగాడికి, తనకున్న వ్యక్తిగత స్నేహం వల్లే గిల్ నేరుగా భారత జట్టులో క్యాప్ వచ్చేలా చేశాడని నెటిజన్లు దుయ్యబడుతున్నారు. గతంలో కూడా దేవదత్ పడిక్కల్‌ను కాదని టెస్టుల్లో సాయ్ సుదర్శన్‌కు గిల్ ఇలాగే ప్రాధాన్యత ఇచ్చాడనే పాత విషయాలను కూడా ఫ్యాన్స్ ఇప్పుడు బయటకు తీస్తున్నారు.
No hate to Gurnoor Brar, but it’s genuinely surprising that he’s made his India debut before even making his IPL debut.
He’s had a solid domestic season, no doubt. But if we’re talking purely on merit, Prince Yadav seemed ahead in the queue for this opportunity.
Also, the fact… pic.twitter.com/Wo5If4Mwkt
— The King 👑 (@lordkings_x) June 13, 2026
డీఆర్‌ఎస్ నిర్ణయాలపైనా విమర్శలు
కేవలం జట్టు ఎంపికలోనే కాకుండా.. మ్యాచ్ జరుగుతున్న సమయంలో గిల్ తీసుకున్న రివ్యూ నిర్ణయాలు కూడా ఈ ఆరోపణలకు మరింత బలాన్ని చేకూర్చాయి. అఫ్గానిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు గిల్ తన గుజరాత్ టైటాన్స్ సహచరుడైన గుర్నూర్ బ్రార్ వేసిన బంతికి ఎల్బీడబ్ల్యూ కోసం ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే డీఆర్‌ఎస్ రివ్యూ తీసుకున్నాడు. అయితే అది కాస్తా వేస్ట్ అయింది. మరోవైపు అఫ్గాన్ స్టార్ బ్యాటర్ రహ్మానుల్లా గుర్బాజ్ క్రీజులో ఉన్నప్పుడు అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో స్పష్టమైన అవకాశం వచ్చినా గిల్ రివ్యూ తీసుకోలేదు. ఆ తర్వాత మరో గుజరాత్ ప్లేయర్ వాషింగ్టన్ సుందర్ కోసం కూడా గిల్ ఒక రివ్యూను వృధా చేశాడు.
🚨 Questions Raised Over Team Selection Under Shubman Gill’s Leadership 🚨
• Sai Sudharsan preferred over Devdutt Padikkal in the Test setup
• Gurnoor Brar picked ahead of Prince Yadav👀 Meet Gurnoor Brar:
• Stands close to 6 feet tall
• Served as a net bowler for Mumbai… pic.twitter.com/IY7YvTR88T— Manoj Tiwari (@ManojTiwariIND) June 13, 2026
డ్రెస్సింగ్ రూమ్ గ్రూపిజంపై ఫ్యాన్స్ ఫైర్
కెప్టెన్‌గా ఉన్నవాడు జట్టు ప్రయోజనాలను చూడాలి కానీ.. తన ఐపీఎల్ ఫ్రాంచైజీ ఆటగాళ్లకు, స్నేహితులకు మాత్రమే సపోర్ట్ చేయకూడదని క్రికెట్ విశ్లేషకుల, ఫ్యాన్స్ హితవు పలుకుతున్నారు. గిల్ ప్రవర్తన వల్ల టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో గ్రూపిజం పెరుగుతోందని, ప్రతిభ ఉన్న లీస్ట్-ఏ ప్లేయర్లకు అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ గెలిచిన ఆనందంలో ఉండాల్సిన భారత జట్టు, ఇప్పుడు కెప్టెన్ చేసిన ఈ తప్పుడు నిర్ణయాల వల్ల తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి