
Guwahati Test : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో ఓటమి తర్వాత, టీమిండియా ఇప్పుడు 0-1తో వెనుకబడి ఉంది. సిరీస్‌ను సమం చేయాలంటే నవంబర్ 22 నుంచి గువహతిలో జరగనున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ కచ్చితంగా గెలవాలి. అయితే ఈ కీలకమైన మ్యాచ్‌కు ముందు భారత జట్టులో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడకపోవచ్చనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. గిల్‌కు మెడ గాయం కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం గిల్ జట్టుతో కలిసి గువహతికి ప్రయాణించినా అతని ఆరోగ్య పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటారు. గిల్ ఒకవేళ అందుబాటులో లేకపోతే వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉంది.
గిల్ స్థానంలో ఆడించేందుకు ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డిని తిరిగి టీమిండియాలోకి తీసుకున్నారు. మొదట్లో ఇండియా-ఎ తరఫున ఆడేందుకు రిలీజ్ అయిన నితీష్, గిల్ రిప్లేస్‌మెంట్‌గా జట్టుతో తిరిగి చేరాడు. మరోవైపు చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా రెండో టెస్ట్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. మీడియా రిపోర్ట్స్ ప్రకారం.. నవంబర్ నెలాఖరులో కుల్దీప్‌కు పెళ్లి ఉండటం వలన అతను బీసీసీఐకి సెలవు కోసం అభ్యర్థన పంపినట్లు తెలుస్తోంది. కుల్దీప్ లేకపోతే భారత జట్టు స్పిన్ విభాగంపై మరింత భారం పడుతుంది.
ప్రస్తుత పరిస్థితులు, జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని సౌతాఫ్రికాతో జరిగే రెండో టెస్ట్‌కు భారత జట్టు సంభావ్య ప్లేయింగ్ ఎలెవన్ ఈ విధంగా ఉండే అవకాశం ఉంది.. ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఆడగా, మిడిల్ ఆర్డర్‌లో సాయి సుదర్శన్, ధ్రువ్ జురెల్, రిషభ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్) ఉంటారు. ఆల్‌రౌండర్లుగా నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఉండగా, పేస్ బౌలర్లుగా మహమ్మద్ సిరాజ్, జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌కు నాయకత్వం వహిస్తారు. ఈ బలంగా ఉన్న ప్లేయింగ్ ఎలెవన్ ద్వారా భారత జట్టు సిరీస్‌ను 1-1తో సమం చేయాలని గట్టి ప్రయత్నం చేయనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..