Shubman Gill : శుభమన్ గిల్ రీఎంట్రీపై వీడిన సస్పెన్స్.. సౌతాఫ్రికా 20 సిరీస్ పై BCCI కీలక ప్రకటన!

Shubman Gill : భారత్, సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ కీలకమైన సిరీస్‌కు ముందు యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్ గురించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. BCCI గిల్ తన రిహాబిలిటేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు, మూడు ఫార్మాట్లలో ఆడటానికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలియజేసింది.

Shubman Gill : శుభమన్ గిల్ రీఎంట్రీపై వీడిన సస్పెన్స్.. సౌతాఫ్రికా 20 సిరీస్ పై BCCI కీలక ప్రకటన!
Shubman Gill Retired Hurt

Updated on: Dec 06, 2025 | 5:05 PM

Shubman Gill : భారత్, సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానుంది. ఈ కీలకమైన సిరీస్‌కు ముందు యంగ్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఫిట్‌నెస్ గురించి ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. బెంగళూరులోని BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (NCA), గిల్ తన రిహాబిలిటేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్నట్లు, మూడు ఫార్మాట్లలో ఆడటానికి పూర్తిగా ఫిట్‌గా ఉన్నట్లు భారత జట్టు మేనేజ్‌మెంట్‌కు తెలియజేసింది. దీంతో గిల్ టీ20 సిరీస్‌లో ఆడటం ఖాయమైంది.

దక్షిణాఫ్రికాతో కోల్‌కతాలో జరిగిన టెస్ట్ మ్యాచ్ రెండో రోజున ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో శుభ్‌మన్ గిల్‌కు మెడకు గాయం అయింది. సైమన్ హార్మర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో మెడ పట్టుకోవడంతో చికిత్స కోసం అతన్ని ఆసుపత్రిలో కూడా చేర్చాల్సి వచ్చింది. ఈ గాయం కారణంగానే గిల్ దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్‌కు కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది.

దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌కు తిరిగి రావడానికి, శుభ్‌మన్ గిల్ బెంగళూరులోని NCAలో ఫిట్‌నెస్ నిరూపించుకునే ప్రోటోకాల్‌ను పూర్తి చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో అతను రిహాబిలిటేషన్‌తో పాటు స్కిల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. బ్యాటింగ్, ఫీల్డింగ్, మ్యాచ్ సిమ్యులేషన్ వంటి అన్ని విభాగాల్లోనూ పూర్తి స్థాయి ప్రాక్టీస్ చేసి, ఫిట్‌నెస్‌ను నిరూపించుకున్నాడు.

కటక్‌కు చేరుకోనున్న టీమ్

దక్షిణాఫ్రికాతో టీ20 స్క్వాడ్‌లో ఉన్న భారత ఆటగాళ్లు శనివారం (డిసెంబర్ 6) కటక్‌కు చేరుకోనున్నారు. ఈ రెండు జట్ల మధ్య మొదటి టీ20 మ్యాచ్ అక్కడే జరగనుంది. భారత జట్టు మొదటి ట్రైనింగ్ సెషన్ ఆదివారం నిర్వహిస్తారు. భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 16 వరకు కొనసాగనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..