ఇక ఫ్యూచర్ కెప్టెన్‌కు నో ఛాన్స్.. రిస్క్ వద్దంటున్న క్రికెట్ పెద్దన్న.. వరల్డ్‌కప్‌లోనూ అంతే..!

|

Sep 17, 2023 | 1:19 PM

టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌కు పెద్ద కష్టం వచ్చిపడింది. గాయం కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రేయాస్ అయ్యర్. వచ్చీరాగానే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో చోటు సంపాదించాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు మాత్రం చేయగలిగాడు.

ఇక ఫ్యూచర్ కెప్టెన్‌కు నో ఛాన్స్.. రిస్క్ వద్దంటున్న క్రికెట్ పెద్దన్న.. వరల్డ్‌కప్‌లోనూ అంతే..!
Indian Cricket Team
Follow us on

టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌కు పెద్ద కష్టం వచ్చిపడింది. గాయం కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత ఆసియా కప్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రేయాస్ అయ్యర్. వచ్చీరాగానే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా తుది జట్టులో చోటు సంపాదించాడు. ఆ మ్యాచ్‌లో కేవలం 14 పరుగులు మాత్రం చేయగలిగాడు. ఇక నేపాల్‌ మ్యాచ్‌కు అసలు బ్యాటింగ్‌కే దిగలేదు. అటు సూపర్-4 స్టేజిలో పాకిస్తాన్ మ్యాచ్‌కు మరోసారి వెన్నునొప్పి తిరిగబెట్టడంతో శ్రేయాస్ అయ్యర్ జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో కెఎల్ రాహుల్ తుది జట్టులోకి వచ్చాడు. కానీ అభిమానులు మాత్రం అయ్యర్‌ను తప్పించి.. కావాలనే రాహుల్‌కు టీం మేనేజ్‌మెంట్ ఛాన్స్ ఇచ్చిందని భావిస్తున్నారు.

మరోవైపు సూపర్ ఫోర్‌లో జరిగిన పాకిస్తాన్ మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ అజేయ సెంచరీతో(111) తన రీ-ఎంట్రీని ఘనంగా చాటాడు. అయ్యర్ స్థానమైన నాలుగో ప్లేస్‌లో రాహుల్ ఆ తర్వాతి మ్యాచ్‌లలోనూ రాణించాడు. ఇక ఐదులో వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ అదరగొడుతున్నాడు. ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి పోరులోనూ శ్రేయాస్ అయ్యర్ ఫిట్‌గా ఉన్నా.. అతడ్ని టీం మేనేజ్‌మెంట్ తుది జట్టులోకి తీసుకోలేదు. యధావిధిగా రాహుల్ నాలుగో స్థానంలో, ఇషాన్ కిషన్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చారు. ఇవన్నీ చూస్తుంటే.. శ్రేయాస్ అయ్యర్‌కు మరోసారి నిరాశ మిగలనుంది. శ్రీలంకతో ఫైనల్‌ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ ఆడే పరిస్థితి కనిపించట్లేదు.

దీనిపై టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం స్పందిస్తూ.. టీం మేనేజ్‌మెంట్ అయ్యర్ కంటే.. కిషన్ వైపే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అసలు ఇంతకీ అయ్యర్‌కు ఏమైంది.? నిజంగా ఫిట్‌నెస్ సమస్యలు ఉన్నాయా.? అయ్యర్ ఫిట్‌గా ఉన్నాడని చెప్పారు.. కానీ ఇప్పుడు అవకాశాలు ఇవ్వట్లేదా.? అనే ప్రశ్నలు అభిమానుల్లో తలెత్తుతున్నాయి. వన్డే వరల్డ్‌కప్‌లోనూ అయ్యర్ పరిస్థితి ఇదేనని మరికొందరు అంటున్నారు. అయితే ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియాతో జరిగే సన్నాహక వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ కంబ్యాక్ ఇవ్వోచ్చునని విశ్లేషకులు అభిప్రాయం. కాగా, సొంతగడ్డపై సెప్టెంబర్ 22- 27 వరకు ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడనుంది టీమిండియా. ఇక ఈ రెండు జట్లు వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అక్టోబర్ 8న తలబడనున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..