ఇదెక్కడి మ్యాచ్‌రా మావా.. 54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..

Shortest T20I Match: టీ20 మ్యాచ్ అంటే పరుగుల వరద, ఉత్కంఠభరిత పోరాటం గుర్తుకొస్తాయి. కానీ ఓ అంతర్జాతీయ మ్యాచ్‌లో మాత్రం సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఒక జట్టు కేవలం 10 పరుగులకే ఆలౌటవ్వగా, ప్రత్యర్థి జట్టు లక్ష్యాన్ని కేవలం 2 బంతుల్లోనే ఛేదించింది. ఈ మ్యాచ్ ఎక్కడ జరిగిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ఇదెక్కడి మ్యాచ్‌రా మావా.. 54 బంతుల్లో మ్యాచ్ క్లోజ్.. 2 బంతుల్లోనే ఛేజింగ్..
Shortest T20i Match

Updated on: Aug 26, 2026 | 7:49 PM

Shortest T20I Match: టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ బంతుల్లో ముగిసిన మ్యాచ్‌గా స్పెయిన్, ఐల్ ఆఫ్ మాన్ మధ్య జరిగిన పోరు నిలిచింది. 2023లో ఐల్ ఆఫ్ మాన్ జట్టు స్పెయిన్ పర్యటనకు వెళ్లిన సమయంలో ఈ మ్యాచ్ జరిగింది. ఆరు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరు అనూహ్యంగా ఏకపక్షంగా సాగింది. టాస్ గెలిచిన స్పెయిన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఐల్ ఆఫ్ మాన్ ఆటగాళ్లు స్పెయిన్ బౌలర్లను ఏమాత్రం ఎదుర్కోలేకపోయారు. కేవలం 8.4 ఓవర్లలో 10 పరుగులకే మొత్తం జట్టు ఆలౌటైంది. ఆ తర్వాత స్పెయిన్‌కు 11 పరుగుల లక్ష్యం మాత్రమే మిగిలింది.

6 వికెట్లు డకౌట్.. 10 పరుగులకే కుప్పకూలిన టీం..

ఐల్ ఆఫ్ మాన్ ఇన్నింగ్స్‌లో కేవలం నలుగురు బ్యాటర్లు మాత్రమే ఖాతా తెరిచారు. ఆరుగురు బ్యాటర్లు సున్నాకే పెవిలియన్ చేరారు. ఎడ్వర్డ్ వాకర్ మాత్రం ఖాతా తెరవకుండానే నాటౌట్‌గా నిలిచాడు.

ఎక్కువమంది చదివినది: IPL 2027: ముగిసిన హార్దిక్ ట్రేడింగ్.. బలిపశువుల్లా ఆ ఇద్దరు.. ఏ టీంలో చేరనున్నాడంటే?

ఇవి కూడా చదవండి

స్పెయిన్ బౌలర్లలో మొహమ్మద్ కమ్రాన్ నాలుగు ఓవర్లలో ఒక మెయిడిన్‌తో 4 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. ఆతిఫ్ మహ్మూద్ 2 మెయిడిన్ ఓవర్లు వేసి 6 పరుగులతో 4 వికెట్లు పడగొట్టాడు. లార్న్ బర్న్స్ 4 బంతుల్లో రెండు వికెట్లు తీశాడు.

2 బంతుల్లోనే 11 పరుగుల లక్ష్యం ఛేదన..

10 పరుగులకు ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన స్పెయిన్‌కు 11 పరుగుల విజయలక్ష్యం ఎదురైంది. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ఎక్కువ సమయం పట్టలేదు. ఓపెనర్ అవైస్ అహ్మద్ రెండు సిక్సర్లతో నాటౌట్‌గా 12 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించాడు.

ఎక్కువమంది చదివినది: ఎవర్రా మీరు.. నో బాల్ కాదు.. వైడ్ కూడా కాదు.. కట్‌చేస్తే.. ఒకే బంతికి ఏకంగా 7 పరుగులు..!

స్పెయిన్ ఇన్నింగ్స్‌లో మొత్తం 3 బంతులు మాత్రమే నమోదయ్యాయి. తొలి బంతి నోబాల్ కావడంతో అది చెల్లుబాటు కాలేదు. దీంతో కేవలం 2 బంతుల్లోనే స్పెయిన్ లక్ష్యాన్ని అందుకుంది. రెండు ఇన్నింగ్స్‌లను కలిపితే మ్యాచ్‌లో మొత్తం 54 బంతులే నమోదయ్యాయి.

స్పెయిన్, ఐల్ ఆఫ్ మాన్ మధ్య జరిగిన ఈ మ్యాచ్ టీ20 క్రికెట్‌లో ఎంతటి అనూహ్య ఫలితాలు సాధ్యమో చూపించింది. ఒక జట్టు 10 పరుగులకే కుప్పకూలగా, మరో జట్టు కేవలం 2 బంతుల్లోనే విజయాన్ని అందుకోవడం ఈ మ్యాచ్‌ను ప్రత్యేకంగా నిలిపింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us